తనపై వస్తున్న నిరాధార రూమర్స్ పై సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. “నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించింది. బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో కలిసి “రామాయణం” చిత్రంలో సీత పాత్రలో నటిస్తుంది సాయిపల్లవి. ఈ తరుణంలో ఇటీవల కొన్ని మీడియా సంస్థలు సాయిపల్లవి మాంసాహారం మానేసినట్లు, ఆమె విదేశాలకు వెళ్లేటప్పుడు వంట వాళ్లను తన వెంట తీసుకెళ్తారని కథనాలు రాశాయి.ఈ వార్తలపై తన ఎక్స్ (X) ప్రొఫైల్ లో ఒక పోస్ట్ పెట్టి, ఈ రూమర్స్ పై ఆమె మౌనంగా ఉన్నా, ఇప్పుడు సమయం వచ్చిందని తెలిపారు.
“నా గురించి వచ్చిన ప్రతిసారి రూమర్స్ పై నేను నిశ్శబ్దంగా ఉన్నాను. నిజం దేవునికే తెలియనిది, కానీ ఇప్పుడు మౌనంగా ఉండలేను. నాపై నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తే, ముఖ్యంగా నా సినిమాలు, ప్రకటనలు రిలీజైనప్పుడు, అవి నా కెరీర్ కు దెబ్బతీయొచ్చు” అని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. “ఇలాంటి వార్తలు ఆపకుంటే, ఇక లీగల్ యాక్షన్ తీసుకుంటాను. అది ఎంత పెద్ద మీడియా సంస్థ అయినా సరే. ఇకపై ఈ తరహా రూమర్స్ కు ఊరుకోకూడదు” అని హెచ్చరించారు. ఇది కేవలం సాయిపల్లవి వ్యక్తిగతంగా ఎదుర్కొనే విషయమే కాక, సినిమా ఇండస్ట్రీలోని ప్రతి నటి, నటుడికి కూడా ఇది ఒక హెచ్చరికగా మారింది. ఈ తరహా రూమర్స్ పై కఠిన చర్యలు తీసుకోవడానికి సినీ ప్రముఖుల మధ్య చర్చ మొదలైంది.