ఛత్తీస్‌గఢ్‌లో అమిత్‌ షా పర్యటన

Amit Shah's visit to Chhattisgarh

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 13 నుండి 15 వరకు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా నక్సలిజం వ్యతిరేక కార్యాచరణకు సంబంధించి కీలక సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు. ఆగస్టు నెలలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా సమీక్షలో మావోయిస్టుల కార్యకలాపాల నిర్మూలనపై చర్చించనున్నారు.

ఈ సందర్భంగా మావోయిస్టులకు లొంగిపోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని షా హెచ్చరించారు. గతేడాది డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజం నిర్మూలనలో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన తెలిపారు. ఈ సంవత్సర కాలంలో 90 మంది మావోయిస్టులు మృతి చెందగా, 123 మంది అరెస్ట్ అయ్యారని, మరో 250 మంది లొంగిపోయారని పేర్కొన్నారు.

బస్తర్ ప్రాంతం నక్సల్స్ ప్రభావం నుంచి విముక్తి చెందేందుకు చర్యలు చేపట్టామన్నారు. అమిత్ షా బస్తర్‌లోని భద్రతా బలగాల ఫార్వర్డ్ బేస్‌లో ఒక రాత్రి గడపాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో నక్సల్స్ నియంత్రణ నుంచి బయటపడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పనులను సమీక్షించనున్నారు. ప్రజలు హింసను విడిచిపెట్టి సాధారణ జీవన విధానంలో కలవాలని సూచించారు.

నక్సల్స్ సమస్యను పరిష్కరించి ప్రాంతానికి కొత్త భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం బస్తర్‌లో ఎలాంటి సేఫ్ జోన్‌లు లేవని, భవిష్యత్‌లో మరింత శాంతిని నెలకొల్పే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఢిల్లీలో అమిత్ షాను కలిసి, నక్సల్స్ వ్యతిరేక చర్యలపై సమగ్ర వివరాలను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

   lankan t20 league. But іѕ іt juѕt an асt ?. Chinese ambitions for us allies prompts washington security summit with japan, philippines.