హైదరాబాద్ :
మంచు మోహన్ బాబు కుటుంబంలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలపై ఆయన కుమారుడు సినీ నటుడు మంచు విష్ణు స్పందించారు.
కాంటినెంటల్ హస్పటల్ లో మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు. ఫ్యామిలీ సమస్య పై మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. గత ముప్పై సంవత్సరాలుగా మీడియాతో తండ్రిగారికి మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయని, ఎవరో ఒకరు తగ్గుతారని సమస్య పరిస్కారం అవుతుందని అన్నారు.
మా నాన్న మమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం ఆయన చేసిన తప్పని,
మీకు కుటుంబ ఉంది..మీకు సమస్యలు ఉంటాయని ఎదురు ప్రశ్నించారు. మా ఇంటి సమస్యను ఎక్కువగా చుపించడానికి ప్రయత్నం చేయకండని కోరారు. మంగళవారం జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలు అయ్యాయని, తాను కన్నప్ప ప్రేమేషన్ లో ఉండటం వల్ల వెంటనే స్పందించలేక పోయానని అన్నారు. నిన్న రిపోర్టర్ పై ఎటువంటి దాడి చేయలేదని, గేటు బద్దలు కొట్టి లోపలికి వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. మాకు వ్యక్తిగత విషయాలు ఉంటాయని, గాయపడిన రిపోర్టర్ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు.
రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందిస్తానన్నారు. సాయంత్రం నుంచి మీడియాలో నోటీసులు అని వస్తున్నాయి. అయితే ఈ రోజు ఉదయం హస్పటల్ కు వచ్చి రాచకొండ పోలీసులు పదిన్నరకు హజరు కావాలని కోరినట్లు వివరించారు.పోలిసులు అంటే మాకు గౌరవం ఉంది..నేను హజరు అవుతాను అన్నారు. తాను ఊరిలో ఉంటే ఇంత జరిగేది కాదని, మనోజ్ ను నాన్న ఇంట్లో ఉండటానికి ఒప్పుకోలేదని చెప్పారు.
ఆయన స్వయంకృషితో ఆయన సంపాదించుకున్న ఆస్తి ఆయనకు సోంతమని చెప్పారు. ఒకరికి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం..మరోకరికి ఉమ్మడి కుటుంబ అంటే ఇష్టం ఉండదని చెప్పారు. వినయ్ తనకు అన్న లాంటి వారని, ఆయనతో 15 సంవత్సరాల అనుభందం ఉందని అన్నారు. విద్యాసంస్థల్లో ఎటువంటి అవకతవకలు లేవని, తమ విద్యాసంస్థల్లో చదువుకున్న వారు ఉన్నత శిఖరాల్లో ఉన్నారని చెప్పారు.