ఉదయం లేచిన దగ్గర నుంచి మహిళలకు హడావుడి పనులతో వారి ఆరోగ్యం గురించి ఏమి పట్టించుకోరు. అయితే దీని ద్వారా వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్ని పనులు ఉన్న మధ్యమధ్యలో కాస్త విరామం తీసుకుంటూ పనులు చేసుకోవాలి. అంతేకాదు కాస్త వినోదంతో కూడిన పనులు కూడా చేస్తూఉండాలి. ఉదాహరణకు ఫోన్లో క్లోజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడడం, టీవిలో న్యూస్ చూడడం చేయాలి. కాస్త వ్యాయామం చేయాలి. కేవలం మీ మానసిక ఆరోగ్యం కోసం మార్కెట్ కి వెళ్ళాలి. ఈవెనింగ్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి. రోజంతా మీకోసం మీరు ఏమి చేసారో డైరీ రాసుకోవాలి. ఇష్టమైన రంగంలో పని చేయడం స్టార్ట్ చేయండి. వారంలో రెండుసార్లు సేవ పనిలో నిమగ్నం కావాలి. తగినంత నిద్ర కూడా కావాలి. పిల్లలతో కాసేపు స్పెండ్ చేయాలి. వారి కోరికలు, ఆశయాలు ఏమిటో తెలుసుకోవాలి. డైలీ చేసే పనుల్లో మార్పులు ఉండాలి. ఏపని అయినా ఇష్టముతో చేయాలి. ఇష్టమైన ఫుడ్ చేసుకొని హ్యాపీగా తినాలి. క్రమశిక్షణతో కూడిన పనులు చేయాలి. చురుకుగా ఉండేందుకు కృషి చేయాలి. ఇవ్వని చేసినపుడు హెల్త్ మీ సొంతం అవుతుంది.