వికారాబాద్ జిల్లా తాండూరులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థినిలు అనుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సాయిపూర్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా హాస్టల్ భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నంలో పురుగులతో పాటు అడ్డదిడ్డంగా వంటకాలు చేస్తున్నారని, పరిశుభ్రత పాటించడం లేదని విద్యార్థినులు ఆరోపించాడు. నీళ్ళ వారు తప్ప ఇతర కూరగాయల రుచి ఎరుగమని, కిచెన్లో సైతం అపరిశుభ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సోమవారం రాత్రి వండిన భోజనం తినలేకపోయామని వాపోయారు. భోజనం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యావని, హాస్టల్ టీచర్ మంగళవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అస్వస్థతకు గురైన వారిని తరలించినట్లు విద్యార్థినులు తెలిపాడు. దాదాపు 15 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్ పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పంధించి తగు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.