NZ vs ENG: 16 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కైవసం..

nz vs eng

వెల్లింగ్టన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. 323 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి, సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఈ విజయం ఇంగ్లాండ్ జట్టుకు 16 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్ గెలిచే ఘనతను అందించింది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగుల ఆధిక్యంతో 583 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టుకు నిర్దేశించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్, జో రూట్ తన గొప్ప బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ బౌలర్లను కవురేసారు. బ్రూక్, ఓలీ పోప్‌తో కలిసి 174 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 115 బంతుల్లో 123 పరుగులు చేసిన బ్రూక్, ఇంగ్లాండ్ స్కోరును 280 పరుగుల వద్ద చేరుస్తూ, రెండో ఇన్నింగ్స్‌లో కూడా అర్ధ సెంచరీ సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా అతన్ని ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపిక చేశారు. జో రూట్ కూడా 106 పరుగులతో ఇంగ్లాండ్ లక్ష్యాన్ని మరింత పెంచాడు.

ఇంగ్లాండ్ బౌలర్లు కూడా తమ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌లో గస్ అట్కిన్సన్ మరియు బ్రైడన్ కార్సే ప్రతీరు 4 వికెట్లు తీశారు. టామ్ లాథమ్ బాగా రాణించినా, న్యూజిలాండ్ జట్టు కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయింది. 155 పరుగుల ఆధిక్యం తో ఇంగ్లాండ్ జట్టు తన ఆధిక్యాన్ని పెంచుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ 3 వికెట్లు పడగొట్టగా, కార్సే, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, అట్కిన్సన్ చెరొ 2 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను 259 పరుగులకే ఆలౌట్ చేయడంలో విజయాన్ని అందించారు.ఈ అద్భుత విజయంతో ఇంగ్లాండ్ సిరీస్‌ను ఖాయంగా గెలిచింది. మిగిలిన మూడో టెస్టులో ఓడినప్పటికీ, ఈ సిరీస్ ఇంగ్లాండ్ జట్టుకే చెందుతుంది. 16 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడం ఇంగ్లాండ్ క్రికెట్‌కు అద్భుతమైన ఘనత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Read more about un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. Life und business coaching in wien – tobias judmaier, msc. Retirement from test cricket.