తండ్రి తిన్న ప్లేట్ ను తీసి శభాష్ అనిపించుకున్న నారా లోకేష్

naralokeshWell done

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు , లోకేష్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం చంద్రబాబు తిన్న ప్లేట్ ను నారా లోకేశ్ తీసి, శుభ్రత సిబ్బందికి సహాయం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి కనిపించని ఈ వినయం నారా లోకేశ్ వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచింది.

దీనిపై నారా భువనేశ్వరి తన స్పందనను తెలియజేస్తూ, “చంద్రబాబు తిన్న ప్లేట్ ను తీసి, శుభ్రత సిబ్బందికి సాయం చేసిన లోకేశ్ నా గర్వానికి కారణం. ఇది తల్లిదండ్రుల పట్ల ఉన్న గౌరవాన్ని మాత్రమే కాకుండా, మనకు సహాయం చేసే వారి పట్ల ఉండే విధేయతను కూడా తెలియజేస్తుంది” అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. నారా భువనేశ్వరి ఆ వీడియోను పంచుకోవడంతో, లోకేశ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్యులకే కాదు, నేతలకు కూడా ఇలాంటి చర్యలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Dentist accused of killing wife allegedly wanted fake suicide notes planted – mjm news.