Mithali Raj: పెళ్ళైతే నువ్వు క్రికెట్ మానేయాలి.. తన వివాహం గురించి షాకింగ్ విషయాలు

mithali raj

మిథాలీ రాజ్: మహిళా క్రికెట్‌కు ఓ స్ఫూర్తి, వ్యక్తిగత జీవితంలో ఓ త్యాగం మహిళా క్రికెట్‌లో మార్గదర్శకురాలిగా నిలిచిన మిథాలీ రాజ్, కేవలం ఆటతోనే కాక, వ్యక్తిగత జీవితంలోనూ ఎందరోకి ఆదర్శంగా నిలిచారు. బ్యాటింగ్‌లో తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆమె ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.

ODIల్లో 7,805 పరుగులు చేయడం, టెస్ట్ క్రికెట్‌లో 19 ఏళ్ల వయసులోనే డబుల్ సెంచరీ సాధించడం వంటి విజయాలు ఆమెను “లేడీ టెండూల్కర్”గా గుర్తింపును తెచ్చాయి.అయితే, మిథాలీ వ్యక్తిగత జీవితం మాత్రం పునీతమైన త్యాగాలకు నిదర్శనం. 42 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకోకపోవడం అనేకమందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అంశంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మనసులోని ఆలోచనలను పంచుకున్నారు. మిథాలీ మాట్లాడుతూ, క్రికెట్‌ కోసం తన వ్యక్తిగత జీవితం మీద చేసిన ప్రభావాన్ని వివరించారు. ఓ సందర్భంలో ఓ కుటుంబం పెళ్లి సంబంధం కోసం తమ ఇంటికి వచ్చినప్పుడు, ఆమె పెళ్లి అయిన తర్వాత కూడా క్రికెట్ ఆడుతానని స్పష్టంగా చెప్పారట. అయితే ఆ కుటుంబం ఆమెను క్రికెట్‌ను వదిలిపెట్టాల్సిందిగా, పిల్లల సంరక్షణను ప్రధాన బాధ్యతగా తీసుకోవాల్సిందిగా కోరింది.

ఆ మాటలు తనను ఎంతగానో కలిచివేసాయని, కానీ అప్పటికి తన నిర్ణయం క్లియర్‌గా తీసుకున్నట్టు మిథాలీ వెల్లడించారు.తన స్నేహితురాలితో ఈ విషయం చర్చించిన అనంతరం, తల్లి తండ్రుల చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని, ఎవరి కోసమో తాను తన కెరీర్‌ను త్యజించలేనని తేల్చిచెప్పింది. క్రికెట్‌ పట్ల ఉన్న ఆ ప్రేమ, దేశానికి సేవ చేయాలనే ఆరాటం ఆమెను వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టడానికి ప్రేరేపించాయి.అదేవిధంగా, పెళ్లి తర్వాత కూడా క్రికెట్ కొనసాగించే ఆలోచనను మిథాలీ అనేకసార్లు పరిగణలోకి తీసుకుంది. తన అత్తమామల మద్దతు ఉంటే, శారీరకంగా ఫిట్‌గా ఉంటే క్రికెట్ ఆడతానని ఆమె స్పష్టంగా చెప్పారు. ఇటీవల, శిఖర్ ధావన్‌తో తన పెళ్లి గురించి వచ్చిన పుకార్లను మిథాలీ ఖండించారు. శిఖర్ కూడా ఈ పుకార్లకు వ్యతిరేకంగా మాట్లాడి, అవన్నీ అసత్యమని స్పష్టం చేశారు. మహిళా క్రికెట్‌కి మిథాలీ రాజ్ చేసిన సేవలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. ఆమె చేసిన త్యాగాలు, తీసుకున్న నిర్ణయాలు అనేకమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Life und business coaching in wien – tobias judmaier, msc. Retirement from test cricket.