టాలీవుడ్‌లోనే సంచలనం సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినిమాలు తీయడం తగ్గినప్పటికీ, వివాదాలకు దూరంగా ఉండడంలేదు. తన సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ సెన్సేషనల్ కామెంట్లతో వార్తల్లోనే ఉంటాడు. తాజాగా, తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ, ఈ దర్శకుడు ఒక వివరణ ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు.వివరాల్లోకి వెళ్ళితే, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘వ్యూహం’ సినిమా వివాదాస్పదంగా మారింది. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో తెలుగు రాజకీయ ప్రముఖులను సరికొత్త కోణంలో చూపించిన విషయం అనేక విమర్శలను . ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను వ్యంగ్యంగా చూపించినందుకు పార్టీ నాయకులు తీవ్రంగా ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే అనేక రకాల అడ్డంకులు ఎదురైనప్పటికీ, చివరికి ఈ సినిమా విడుదలైంది.
ఇప్పుడు, ఈ సినిమాపై మరో సీరియస్ ఆరోపణ వెలువడింది. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా వ్యూహం సినిమా కోసం ఏపీ ప్రభుత్వం దాదాపు రూ. 2.10 కోట్లను మంజూరు చేసిందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, తన సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.అతని ప్రకారం, “వ్యూహం సినిమా దాసరి కిరణ్‌కుమార్ నిర్మాతగా, శ్రీకాంత్ ఫైనాన్స్‌లతో రూపొందింది. నా పార్టనర్ రవివర్మ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రసార హక్కులను కొనుగోలు చేశాడు. వ్యూహం సినిమాకు సంబంధించిన ప్రసార హక్కులు ఏపీ ఫైబర్ నెట్ 2 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, ఫైనల్‌గా ఒక్క కోటి రూపాయలు మాత్రమే చెల్లించబడింది. ఈ ఒప్పందం శ్రీకాంత్, రవివర్మలతో సంబంధం ఉన్నది.” అని వర్మ తెలిపారు.
తరువాత, వర్మ అన్నారు, “అయితే, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ తమ భాగస్వామికి ఇంకా బకాయిలు చెల్లించలేదని, వకిలు కోర్టులో కేసు వేసినట్టు వెల్లడించారు. అలాగే, కొన్ని మీడియా సంస్థలు తమపై అవాస్తవంగా ప్రచారం చేసి పరువు నష్టం కలిగించినందుకు కూడా న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని” అన్నారు.ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిపై ప్రజలతో పాటు మీడియా కూడా ఆసక్తిగా స్పందిస్తున్నారు.