हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు..ప్రధాన చర్చ వీటిపైనే

Sudheer
డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు..ప్రధాన చర్చ వీటిపైనే

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తూ శాసనసభ, శాసనమండలి సమావేశాలు అదే రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్తు ఒప్పందాలు, థర్మల్‌ పవర్‌ప్లాంట్లపై కమిషన్ నివేదిక, ఫోన్‌ట్యాపింగ్ వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది.

విజయోత్సవాల సందర్భంగా ఈనెల 7 నుంచి 9 వరకు ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఆఖరి మూడు రోజుల్లో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించేలా హైదరాబాద్ నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదుచోట్ల వేదికలపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని, పీవీ మార్గ్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకూ భిన్న రీతుల ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు.

ప్రజల ఆకర్షణ కోసం హస్తకళల ప్రదర్శన, ఫుడ్ స్టాళ్లతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఐమాక్స్ HMDA గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. 7న వందేమాతరం శ్రీనివాస్‌, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న తమన్ సంగీత విభావరిని ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాలు ప్రజలలో ఉత్సాహాన్ని నింపనున్నాయి.

డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశముందని సీఎస్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని పనులను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.

ఉత్సవాల ముగింపు రోజున డ్రోన్, లేజర్ షో, బాణసంచా ప్రదర్శనలు భారీగా నిర్వహించనున్నారు. ఈ విజయోత్సవాలు ప్రజలకు ప్రభుత్వ విజయాలను చాటి చెప్పే విధంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఆర్థిక మాంద్యం మధ్యా ఈ ఉత్సవాలు ప్రజలలో చైతన్యం నింపుతాయని భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

📢 For Advertisement Booking: 98481 12870