ధోనీతో సరిగా మాట్లాడక చాలా కాలమైందన్న హర్భజన్ సింగ్

Harbhajan Singh

టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్‌ల మధ్య సంబంధాలు సవ్యంగా లేవన్న పుకార్లపై హర్భజన్ తాజాగా స్పందించారు. వీరి మధ్య స్నేహబంధం గడచిన కొన్ని సంవత్సరాలుగా క్షీణించిందని ఆయన స్వయంగా ధ్రువీకరించారు. ధోనితో సరిగా మాట్లాడి దాదాపు పదేళ్లు పైగా అయిపోయిందని హర్భజన్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.ఈ విషయంపై మాట్లాడిన హర్భజన్, “నేను ధోనీతో మాట్లాడను. చివరిసారి మా మధ్య సరిగా సంభాషణ జరిగి దశాబ్దం పైగానే అయింది. నేను చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున ఆడుతున్నప్పుడు, మా సంభాషణలు కేవలం ఆటకు మాత్రమే పరిమితమయ్యాయి. నాకైతే ఎలాంటి కారణం లేదు, కానీ బహుశా ధోనీకి ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉండవచ్చు.

నేను ఎప్పుడూ ధోనీ గదికి వెళ్లలేదు, ఆయన కూడా నా గదికి రాలేదు,” అని హర్భజన్ చెప్పాడు.అతను ధోనీతో మాట్లాడేందుకు రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ, ఎలాంటి స్పందన రాలేదని హర్భజన్ వివరించాడు. “ఆ ప్రయత్నాల తర్వాత నేను ఆ విషయంపై దృష్టి పెట్టడం మానేశాను. నా కాల్స్‌ని లిఫ్ట్ చేసే వాళ్లకే మళ్లీ ఫోన్ చేస్తాను. ధోనీ నాతో ఏదైనా చెప్పాలనుకుంటే అప్పటికే చెప్పేవాడు. కానీ చెప్పలేదంటే, నేను ఇక ముందు వెళ్లాలని అవసరం లేదు. నా జీవితంలో అనవసరమైన వాటిపై సమయం వెచ్చించలేను.

నాకు ఇష్టమైన, నన్ను అర్థం చేసుకునే వారితోనే నా స్నేహబంధం కొనసాగిస్తాను,” అని హర్భజన్ అన్నారు.క్రికెట్ నెక్స్ట్ అనే మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ ఈ అంశాలపై స్పష్టతనిచ్చాడు.దీని ద్వారా ధోనీతో తన సంబంధాలు సవ్యంగా లేవని పరోక్షంగా నిర్ధారించాడు.నిజానికి, 2018 నుంచి 2020 వరకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున హర్భజన్ ఆడినప్పటికీ, మైదానంలో వారి సంభాషణలు కేవలం ఆట పరమైన విషయాలకే పరిమితమయ్యాయి. వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం కనిపించలేదు.

ఈ వ్యాఖ్యలతో హర్భజన్ ధోనీపై ఎలాంటి విమర్శ చేయకపోయినా, వారి మధ్య ఉన్న దూరాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఇద్దరూ క్రికెట్‌లో అత్యున్నత స్థాయిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించినా, వారి వ్యక్తిగత బంధం గడిచిన కాలంతో పాటు మసకబారిపోయినట్టు స్పష్టమవుతోంది.క్రికెట్ అభిమానుల దృష్టిలో ఎప్పటికీ లెజెండ్స్‌గా నిలిచే ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య స్నేహబంధం మళ్లీ మెరుగుపడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2024 2028 asean eye. Safaricom’s half year profits dip amid ethiopian currency woes, increased capex. Paarberatung archive life und business coaching in wien tobias judmaier, msc.