మిథాలీ రాజ్ – మహిళల క్రికెట్‌లో లెజెండరీ పాత్ర మిథాలీ రాజ్ పేరు వినగానే, భారత మహిళల క్రికెట్‌కు ఇచ్చిన ఆమె సేవలు, విజయాలు, రికార్డులు గుర్తుకొస్తాయి. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆమె రికార్డు లెక్కలేనన్ని అభిమానులను సంపాదించుకుంది. అయితే, మిథాలీ రాజ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇటీవల ఆసక్తికరంగా మారింది.వివరాలకు వెళ్తే, మిథాలీ రాజ్ యూట్యూబ్‌లో రణవీర్ అల్లాబాడియా నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత విషయాలు, ఇష్టాలు పంచుకున్నారు. రణవీర్ ఆమెను “మీరు RCB ఫ్యానా?” అని అడిగినప్పుడు, మిథాలీ తాను RCB ఫ్యాన్ కాదని, తన ఇష్టమైన ఐపీఎల్ జట్టు Sunrisers Hyderabad (SRH) అని తెలిపింది. “నేను హైదరాబాద్‌లోని వ్యక్తినే కాబట్టి SRH ఫ్యాన్,” అని ఆమె జవాబిచ్చారు.
“ఎంతగా ఆడినా లేదా ఆడకపోయినా, మన జట్టుకు మద్దతు ఇవ్వడం మన బాధ్యత,” అని మిథాలీ మరింత వివరించారు.పెళ్లి గురించి ఆసక్తికరమైన వివరణ అలాగే, ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని, క్రికెట్ పట్ల ఉన్న పట్టుదల కారణంగానే అది జరిగిందని చెప్పింది. క్రికెట్ తన జీవితంలో అత్యంత ప్రాధాన్యత పొందిన విషయం అని, దానిపై దృష్టి పెట్టడంలోనే తన సమయం మొత్తం గడిచిపోయిందని వివరించారు.
ఈ వ్యాఖ్యలతో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.మహిళల క్రికెట్‌లో మిథాలీ పాత్ర మిథాలీ రాజ్ తన 20 ఏళ్లకు పైగా ఉన్న క్రికెట్ ప్రయాణంలో మహిళల క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లారు. వన్డేల్లో ఆమె చేసిన 7,805 పరుగులు, ఏడు సెంచరీలు, అత్యధిక అర్ధసెంచరీల రికార్డులు ఆమె నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. టెస్ట్ క్రికెట్‌లోనూ అద్భుతమైన రికార్డులు నెలకొల్పిన ఆమె, జట్టులో కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా, దశాబ్దంపాటు భారత బ్యాటింగ్ లైనప్‌కు మూలస్తంభంగా నిలిచారు.2017 మహిళల ప్రపంచకప్‌లో జట్టును కెప్టెన్‌గా నడిపించిన మిథాలీ, వరుసగా అత్యధిక అర్ధసెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. పద్మశ్రీ, ఖేల్ రత్న వంటి ప్రతిష్టాత్మక అవార్డులతో ఆమె గౌరవించబడ్డారు.
మిథాలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు డిసెంబర్ 3న మిథాలీ రాజ్ తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. మొత్తం 333 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 10,868 పరుగులు చేసిన మిథాలీ, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచారు. మహిళల క్రికెట్‌ను నూతన దశకు తీసుకెళ్లిన మిథాలీ రాజ్ సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయి.