ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా, రాజధాని అమరావతి అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి పెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు, కేంద్రం నుండి ఆర్థిక మద్దతు అందడంతో, అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా, సీఆర్డీయే (సిటీ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ) 11,467 కోట్ల రూపాయలతో అమరావతిలో ఆగిపోయిన నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది.సీఆర్డీఏ 41వ అథారిటీ సమావేశంలో ఆమోదం పొందిన ఈ నిర్ణయాలు, మొత్తం 23 అంశాలకు సంబంధించి కీలకమైనవి. 2014 నుంచి అమరావతి అభివృద్ధి కోసం పలు కమిటీలు మరియు నివేదికల ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతున్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం దిశగా పలు చర్యలు తీసుకోవడంలో వేగం పెరిగింది.
పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ భవనాలు, రిజర్వాయర్లు, రోడ్ల నిర్మాణం వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా, 360 కిమీల ట్రంక్ రోడ్ల నిర్మాణం కోసం 2,498 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటిలో వరద నివారణకు, పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్ వంటి పనులు నిర్వహించేందుకు 1,585 కోట్ల రూపాయలు కేటాయించారు.అంతేకాకుండా, పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 3,523 కోట్ల రూపాయలు, రైతులకు ఇచ్చిన రిటర్ణబుల్ లే అవుట్‌లలో రోడ్లు మరియు మౌళిక వసతుల కోసం 3,859 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిర్ణయాలతో అమరావతి అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది.
2024 జనవరి నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇక, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లకు ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది. ఈ డిజైన్లకు సంబంధించిన టెండర్లు ఈ నెల 15 నాటికి ఖరారు కానున్నాయి.
డిసెంబర్ నెలాఖరుకి, నిర్మాణ పనులకు కూడా టెండర్లు పిలవబడతాయి.ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని పటిష్టంగా కొనసాగించడం, రాష్ట్రంలో సాంకేతికంగా సమర్థమైన, మరింత ఆకర్షణీయమైన రాజధాని నిర్మించేందుకు కట్టుబడింది. అలాగే, రైతుల సహకారం కూడా అమరావతి అభివృద్ధికి ఎంతో దోహదపడింది.
CM చంద్రబాబునాయుడు నేతృత్వంలో, 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. దీంతో, అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఒక కొత్త మలుపు తీసుకోనుంది. ఈ ప్రణాళికలతో, మరొక ఏడాది కాలంలో అమరావతి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అంచనా వేయబడుతోంది.