Lagacharla incident. Accused in police custody for two days

లగచర్ల ఘటన.. నిందితుడికి రెండు రోజుల పోలీస్ కస్టడీల

హైదరాబాద్‌: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటునకు వ్యతిరేకంగా అక్కడి గ్రామస్తులు వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరగా.. కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడికి అనుమతించింది.

Advertisements

దీంతో పరిగి పీఎస్‌లో సురేష్‌ను ఈరోజు, బుధవారం పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. లగచర్ల దాడి కేసులో ఏ1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి, సురేష్‌కు మధ్య ఉన్న సంబంధాలు, దాడి సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు..చర్చలు ఏమిటన్న దానిపై పోలీసులు సురేష్‌ను ప్రశ్నించనున్నారు. మణికొండలో నివాసముండే సురేష్ లగచర్లకు ఎందుకు రాకపోకలు సాగించారు. దాడిలో గిరిజనులను ఎందుకు రెచ్చగొట్టారు, దానివెనుకున్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Related Posts
కన్నడ హీరో దర్శన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ
కన్నడ హీరో దర్శన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ

కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన దర్శన్ ప్రస్తుతం తన అభిమానుడు రేణుకా స్వామి హత్య కేసులో న్యాయ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో Read more

Boma Akhila Priya : భూమా అఖిలప్రియ నిరసన
akhila priya prostest

టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇవాళ దిన్నెదేవరపాడు వద్ద సాక్షి కార్యాలయం ఎదుట కోళ్లతో నిరసన తెలిపారు. గతంలో విలేకరుల సమావేశంలో పేపర్‌లో వచ్చే ధరకే Read more

నేడు రంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దసరా పండుగ నేపథ్యంలో ఆనవాయితీగా నాగర్‌ కర్నూల్ జిల్లాలోని సొంతూరు కొండారెడ్డిపల్లెలో, ఆ Read more

ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు – ఈటల
Etela hydra

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక శాఖలో లంచం తీసుకోకుండా పనులు జరుగడం లేదని ఆయన ఆరోపించారు. ఇళ్ల దగ్గరే Read more

×