పెళ్లి తర్వాత శోభిత సినిమాల్లో నటిస్తుందా..? చైతు ఏమన్నాడంటే..!!

chaitu weding date

టాలీవుడ్ నటుడు నాగచైతన్య, నటి శోభిత మరికొద్ది గంటల్లో ఒకటి కాబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియో లో రేపు (డిసెంబర్ 04) వీరి వివాహం అట్టహాసంగా జరగబోతుంది. ఈ క్రమంలో సినీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరు వీరి పెళ్లి గురించి అరా తీస్తున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య.. శోభిత సినీ కెరీర్ఫై క్లారిటీ ఇచ్చారు.

పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ సినిమాల్లో నటిస్తారా? అనే ప్రశ్నకు నాగచైతన్య స్పష్టత ఇచ్చారు. ఆమె తన కెరీర్ కొనసాగిస్తుందని, నటనపై తనకు ఉన్న ప్రేమను విడిచిపెట్టదని తెలిపారు. “ప్రతి తెలుగింటిలాగే శోభిత కుటుంబం కూడా సంస్కారం, ఆప్యాయతతో కూడుకున్నది. వారు నన్ను కొడుకులా చూసుకుంటారు,” అని నాగచైతన్య పేర్కొన్నారు.

ఈ వివాహం వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సింపుల్‌గా, సంప్రదాయంగా జరుగుతుందని సమాచారం. ప్రముఖుల హాజరుపై ఇంకా అధికారిక సమాచారం అందలేదు. అభిమానుల మధ్య వీరి పెళ్లి వార్త పెద్ద సంబురంగా మారింది. నాగచైతన్య-శోభిత జంటకు సినీ పరిశ్రమలోనూ మంచి పేరు ఉంది. శోభిత తన నటనా ప్రతిభతో బాలీవుడ్, వెబ్ సిరీస్‌లలో గుర్తింపు పొందింది. ఇక నాగచైతన్య తన వృత్తి జీవితంలో కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నాడు. వీరి వివాహం తరువాత కూడా ఇద్దరూ తమ కెరీర్‌లో సమానంగా ముందుకు సాగుతారని భావిస్తున్నారు.ఈ జంటకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వారి వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాలలో విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వివాహం టాలీవుడ్, బాలీవుడ్ అభిమానులకు ఓ ప్రత్యేక సందర్భంగా నిలవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ia direka bentuk untuk disesuaikan dengan mana mana persekitaran tapak pembinaan dan boleh dipasang dengan cepat. Äolsharfen | johann wolfgang goethe. Advantages of overseas domestic helper.