Pushpa 2: థియేటర్లలో పుష్ప 2 టికెట్స్ ధరలు ఇలా..

Allu Arjun Pushpa 2 The Rule Movie

పుష్పరాజ్ పునరాగమనం: ఇండస్ట్రీలో హడావిడి సినిమా ప్రపంచం ప్రస్తుతం ఒక్క మాట చుట్టూ గిరి చుట్టుకుంటోంది—”పుష్ప, పుష్ప, పుష్ప”! ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగిపోతోంది. పుష్పరాజ్ డిసెంబర్ 4 నుంచే థియేటర్లలో సందడి చేయడానికి సన్నద్ధమయ్యాడు. విడుదలకు ముందే ఈ సినిమాపై చూపిస్తున్న ఆసక్తి, టికెట్ ధరల హైక్,బెనిఫిట్షోలు… అన్నీ కలిపి ఓ ప్రత్యేకమైన హైప్‌ను క్రియేట్ చేశాయి.

పుష్ప2: థియేటర్ హడావిడి తెలంగాణ రాష్ట్రంలో పుష్ప 2: ది రూల్ బెనిఫిట్ షోలు డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతున్నాయి.ఈ ప్రత్యేక షోల టికెట్ ధరలు సాధారణ టికెట్‌ ధరల కంటే 800 రూపాయల మేరకు అధికంగా ఉంటాయి. ఈ షోలకు అదనంగా, అర్ధరాత్రి 1 గంటకు మరొక షోకు కూడా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ యేటర్లలోటికెట్ ధరలకు 150 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 200 రూపాయలు అదనంగా తీసుకునే వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 9 నుంచి 16 మధ్య, సింగిల్ స్క్రీన్ టికెట్‌ ధరలకు 105 రూపాయలు, మల్టీప్లెక్స్ టికెట్‌ ధరలకు 150 రూపాయలు అదనంగా చార్జ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లలో 20 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 50 రూపాయల మేరకు ధరలను పెంచుకోవచ్చు.

పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా థియేటర్లలో విడుదల అవుతోంది. అనేక భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా, సినీడబ్స్ యాప్ సాయంతో ప్రేక్షకులకు వారు కోరుకున్న భాషలో వీక్షించే అవకాశం ఇస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ఆరు భాషల్లో విడుదలవుతుంది. మూడు గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో పుష్ప 2 ప్రేక్షకులను పరవశింపజేయనుంది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా రూ. 1,000 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా విడుదల అనంతరం రూ. 1,800 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల వరకు వసూళ్లుసాధించే అవకాశముంది.ప్రమోషన్ పరంగా, వ్యూస్, లైక్స్ విభాగాల్లో పుష్ప 2 ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించింది.ఇటీవలకాలంలో ఏ పెద్ద సినిమాకు లేని విధంగా, విడుదల ముందు రోజు నుంచే బెనిఫిట్ షోలకు అనుమతులు పొందడం విశ్లేషకుల ప్రశంసలను అందుకుంది.

“నెవర్ బిఫోర్” అనే మాటకు పుష్ప 2 అసలైన అర్థాన్ని ఇవ్వడం చూస్తే, ఈ సినిమా ఎలా ఉండబోతోందో స్పష్టమవుతుంది. సోషల్ మీడియాలో పుష్ప 2 టాకా తహలం చేస్తోంది.రెండు వారాల కిందటే ఈ సినిమా హ్యాష్‌ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు ఉండగానే ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు ఇలాంటి హడావుడి సర్వసాధారణమైంది. కానీ పుష్ప 2 వంటి సినిమాలు విడుదలకు ముందు నుంచే భారీ బజ్ క్రియేట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కంటెంట్ కూడా ప్రామాణికంగా ఉంటే, ఇండియన్ బాక్సాఫీస్‌ను మరోసారి షేక్ చేయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుష్ప 2 కథ, విజువల్స్, మ్యూజిక్ అన్నీ కలిసొచ్చి సినిమా విజయం ఎంత పెద్దదిగా నిలుస్తుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. But іѕ іt juѕt an асt ?. Chinese ambitions for us allies prompts washington security summit with japan, philippines.