Vikrant Massey: షాకింగ్ నిర్ణయం తీసుకున్న హీరో.. నిరాశలో అభిమానులు

vikrant massey

నటుడు విక్రాంత్ మాస్సే తన అభిమానులకు షాకింగ్ నిర్ణయంతో ముందుకొచ్చాడు. ఆయన నటనకు గుడ్ బై చెప్పడంతో పాటు రిటైర్మెంట్ ప్రకటించారు. 37 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే సాధారణంగా చాలా మంది హీరోలు ఏదో ఒక సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్తారు, కానీ విక్రాంత్ మాస్సే ఈ నిర్ణయం చాలా తొందరగా తీసుకున్నారు. విక్రాంత్ మాస్సే తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల విడుదలైన 12th Fail సినిమాతో ఆయన మరో ఘన విజయం సాధించాడు. ఈ సినిమా హిందీ మరియు తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. అయితే, అటు కెరీర్ పరంగా చాంఛలు సాధించిన విక్రాంత్ ఇప్పుడు సినిమాలకు దూరమవుతున్నట్టు ప్రకటించారు.

ఈ విషయాన్ని విక్రాంత్ తన సోషల్మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.”గత కొన్ని సంవత్సరాలు నాకు చాలా మంచి అనుభూతులు ఇచ్చాయి. నన్ను ఎప్పుడూ మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. అయితే, ఇప్పుడు నేను నటన ద్వారా మీ ముందుకు రావడం కాకుండా, కొడుకుగా, భర్తగా, తండ్రిగా నా కుటుంబం దగ్గరకు వెళ్లిపోవడం అన్నది సరైన సమయమని నేను గ్రహించాను” అని ఆయన పేర్కొన్నారు.అతని ఈ నిర్ణయంతో, ఆయన భవిష్యత్తులో కుటుంబం మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. “2025లో మళ్ళీ కలుద్దాం. కొన్ని సినిమాలు, అనేక సంవత్సరాల జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ. మళ్లీ ధన్యవాదాలు.నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను” అని విక్రాంత్ తన పోస్ట్‌లో రాశారు.ఈ నిర్ణయం చాలా మందికి షాకింగ్‌గా ఉందని, అతని అభిమానులు ఆయన నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

“నువ్వు నా ఫేవరెట్ హీరో” అంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేసారు. మరికొందరు “మీరు తిరిగి రాండి, మేము వెయిట్ చేస్తాం” అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.”మీరు భారతదేశం యొక్క అద్భుతమైన నటుడు, దయచేసి వెళ్లవద్దు” అని చాలా మంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. విక్రాంత్ మాస్సే ఈ నిర్ణయంతో తన కెరీర్‌నిముగిస్తాననిప్రకటించినప్పటికీ, ఆయన నటించిన సినిమాలు మరియు ప్రేక్షకుల హృదయాల్లో అతని అద్భుతమైన నటన అనుబంధంగా ఉండిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Präsenz was ist das genau und wie kommt man dazu ? life und business coaching in wien tobias judmaier, msc. Latest sport news.