హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్న పవన్

pawan HARIHARA

సినీ నటుడు , జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు తో పాటు OG మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు మూవీ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు, మరియు ఎ.ఎం. రత్నం నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ డ్రామా, మరియు 17వ శతాబ్దం నాటి మొగల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతుండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

సినిమా కథ పురాతన భారతదేశంలో సాగే ఆత్మవిశ్వాసంతో కూడిన యోధుడి జీవిత చుట్టూ తిరుగుతుంది. హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన యాక్షన్, చారిత్రక సంఘటనలతో ఆకట్టుకుంటారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా..అర్జున్ రాంపాల్ – ఔరంగజేబ్ పాత్రలో, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే విజ‌యవాడ‌లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన చిత్ర‌బృందం పవ‌న్ క‌ళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీ చివ‌రి షెడ్యూల్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాయిన్ అయిన‌ట్లు చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అంటూ ప‌వ‌న్ నిలుచున్న ఫొటోను పంచుకుంది. ఈ మూవీని 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ చిత్రం మొద‌టి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు‌‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sierra code sdn. Der tanzende bär | eine traurige kurzgeschichte. Direct hire fdh.