జ‌గ‌న్ మీద బుర‌ద జ‌ల్లుతున్నారంటూ మాజీ మంత్రి రోజా ఫైర్

roja

అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ , వైస్ షర్మిల చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ‘వైఎస్ షర్మిల .. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లిష్ అర్థం కాదా? నిన్న మీ అన్న‌ రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకుని మీరు మళ్లీ ఒక వితండ‌వాద‌న‌తో తిరిగి జగన్ మీద బురద జల్లుతున్నారు’ అని మాజీ మంత్రి మండిపడ్డారు.

1- 2021లో మే నెల‌లో సెకీ ఎక్క‌డ వేలం వేసింది? 2.14 పైస‌ల‌కు ఎక్క‌డ అమ్మింది?

2- అదానీ వ‌ద్ద గుజ‌రాత్ కరెంటు కొన‌లేదు. గుజ‌రాత్ ప్ర‌భుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజ‌రాత్‌లోని డిస్కంల నుంచి కొనుగోలు చేశాయి.

3- అదానీతో ఒప్పందం చేసుకుంటామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమీ ప‌రుగులు తీయ‌లేదు. 2021, సెప్టెంబరు 15న కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్‌ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ, మనకు అంతకు ముందు టెండర్లలో వచ్చిన అత్యల్ప ఆఫర్‌.. అంటే రూ. 2.49 కే తమ మార్జిన్‌తో సహా విద్యుత్‌ సరఫరా చేస్తామని సెకీ ఆ లేఖలో వెల్లడించిన విష‌యం మీకు తెలియ‌దా?

4- గుజరాత్ లో కానీ, రాజ‌స్థాన్ లో కానీ, సోలార్‌ పవర్‌ రూ.1.99కి కానీ, రూ.2.10 కానీ వ‌చ్చినా అది మ‌న రాష్ట్రానికి ట్రాన్స్‌పోర్టు చేసే స‌రికే ఇంట‌ర్ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జ్‌ మరో రూ.1.98 కూడా పడుతుంది. అప్పుడు యూనిట్ ధ‌ర డ‌బుల్ అవుతుంది. ఈ విష‌యం మీకు తెలియ‌దా? సెకీ మ‌న‌కు ఇన్సెంటివ్‌గా, ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జెస్‌ (ఐఎస్‌టీఎస్‌) మాఫీ అని చెప్ప‌డం కార‌ణంగా యూనిట్ రూ.2.49ల‌కే వ‌స్తోంది.

5- గుజరాత్ లో యూనిట్ రూ.1.99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్‌ చేస్తున్నారు? ఎక్కడ కన్జూమ్‌ చేస్తున్నారన్నది చూస్తే మాన్యుఫాక్చరింగ్‌ టేకింగ్‌ ప్లేస్‌ గుజరాత్‌. అమ్మే డిస్కంలు.. మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్‌ కొనే వాళ్లు. అక్కడే మాన్యుఫాక్చర్‌ చేసి అక్కడే కొంటున్నారు. కాబట్టే వాళ్లకు ఆ రేట్లు వర్తిస్తున్నాయి. ఈ మాత్రం కూడా మీకు తెలియ‌దా?

6- ఇదే సెకీ, ఇదే ఆత్మ నిర్భర్‌ ప్రాజెక్టు కింద తమిళనాడుకు, ఒడిశాకు, ఛత్తీస్‌గఢ్‌కు కూడా రూ.2.61కి అమ్మింది. విద్యుత్‌ ధర కూడా 12 పైసలు తగ్గింది. వాస్త‌వాల‌ను దాచి మీరు ఎవ‌రి మెప్పు కోసం మాట్లాడుతున్నారు?

7- చంద్రబాబుగారి హయాంలో సౌర విద్యుత్‌పై చేసుకున్న ఒప్పందాలు చూస్తే కళ్లు తిరుగుతాయి. పవన విద్యుత్‌ పీపీఏలు చూస్తే.. 2014–19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. రూ.4.84 నుంచి రూ.4.83వరకు. 2014లో మాత్రం రూ.4.70కి వచ్చింది. సోలార్‌కు సంబంధించి.. 2500 మెగావాట్లకు ఆయన పీపీఎలు చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ.6.49కి కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. 2015లో రూ.5.96కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం, 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50కి కొనుగోలు చేశారు. సోలార్‌ ఎనర్జీని యావరేజ్‌గా రూ.5.90కి కొనుగోలు చేశారు.
మరి మా ప్ర‌భుత్వం యూనిట్ రూ.2.49కు కొంటే అది పెద్ద త‌ప్పా? అది పెద్ద నేర‌మా? చంద్ర‌బాబు యూనిట్ ₹5.90ల‌కు కొంటే మంచివాడు.. జ‌గ‌న్ గారు రూ. 2.49ల‌కు కొంటే చెడ్డ‌వాడా? ఇదెక్కడి న్యాయం?

8- మీరు చేస్తున్న రాజకీయాలు, మీరు చేస్తున్న వాదనాలు, మీరు వేస్తున్న ఎత్తుగడలు, మీరు చేస్తున్న విమర్శలు, వీటన్నింటి లక్ష్యం జగన్ గారే. మీరు కోరుకుంటున్నది ఆయన పతనం. మీరు ఎన్ని కోరుకున్నా
జగన్ గారికి ప్రజలు అండగా ఉంటారు అంటూ రోజా ట్వీట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its. Former shеffіеld unіtеd dеfеndеr george bаldосk dies aged 31 | ap news. Today, demonstrators at kent state are asking the university to divest its portfolio of instruments of war.