pushpa 2 trailer views

‘పుష్ప-2’ ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుందో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న భారీ చిత్రం పుష్ప‌-2. ఈ సినిమా డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాట‌ల‌తో పుష్ప‌-2పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే మేకర్స్ వరల్డ్ వైడ్ గా పుష్ప 2 ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 12వేల థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నామని నిర్మాత రవి తెలిపారు. మొత్తం ఆరు భాషల్లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా కోసం సినీడబ్స్ యాప్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. దీంతో థియేటర్లో నచ్చిన లాంగ్వేజ్లో సినిమాను చూడొచ్చని వెల్లడించారు.

ఇదిలా ఉంటె పుష్ప 2 నుండి మరో ట్రైలర్ రాబోతోందా..? అనేది చర్చగా మారింది. థియేట్రికల్ ట్రైలర్ కోసం రెండు కట్స్ చేయించారు. అందులో ఒకటి బయటకు వచ్చింది.. ఇంకోటి అలా ఉంచారు. కానీ ‘పుష్ప 2’ కి కావాల్సినంత బజ్ వచ్చేసింది. పైగా రిలీజ్ కి మరో 5 రోజులు మాత్రమే టైం ఉంది. ప్రీమియర్ షోలు వేస్తున్నారు కాబట్టి.. 4 రోజులు మాత్రమే టైం ఉన్నట్టు లెక్క. సో 4 రోజులకి ఇంకో ట్రైలర్ అవసరమా అనే ఆలోచన కూడా సుకుమార్ కి ఉంది. అయితే రన్ టైం విషయంలో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. నిర్మాత ‘రన్ టైం పెద్ద సమస్య కాదు’ అని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పినా 3 గంటల 20 నిమిషాలు రన్ టైంకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిక్స్ అయ్యి థియేటర్స్ కి రావాలంటే, ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ కొన్ని విజువల్స్ కట్ చేసి రిలీజ్ ట్రైలర్ గా వదిలితే బెటర్ అనేది కొందరి అభిప్రాయం. మరి చిత్ర బృందం ఏం చేస్తుందో చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్‌ చూస్తే..ఆంధ్రా ప్రాంతంలో రూ. 90 కోట్లు, నైజాంలో రూ. 100 కోట్లు, సీడెడ్‌లో రూ. 30 కోట్లకు రైట్స్ అమ్ముడు అయ్యాయి. అంటే, మొత్తం రూ. 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ షేర్‌ అందుకోవాలంటే ‘పుష్ప 2’ తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ. 450 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) (415 కోట్లు)కి ఉన్నాయి. ‘బాహుబలి 2’ (Baahubali 2) (330 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో, ‘పుష్ప 2’కు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లను దాటడం అంత ఈజీ కాదు. ఇది సాధారణ టార్గెట్ కాదు. టికెట్ ధరలు పెంచినా, మొదటి రెండు వారాల్లో ఈ స్థాయి వసూళ్లు అందుకోవడం ట్రేడ్ పండితుల ప్రకారం చాలా కష్టమని చెబుతున్నారు. ‘పుష్ప 2’కు మంచి లాంగ్ రన్ అవసరం. సంక్రాంతి వరకు థియేటర్లలో నిలకడగా వసూళ్లు ఉంటే, ఈ టార్గెట్ సాధించగలదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. For enhver hesteejer, der søger at optimere driften af sin ejendom, er croni minilæsseren en uundværlig hjælper. Giant step for somalia with un security council seat facefam.