15 ఏళ్లకే స్టార్ హీరోయిన్‏గా క్రేజ్.. 1300 కోట్ల ఆస్తులు.. ఈ బ్యూటీ ఎవరంటే..

Asin

చిన్న వయసులోనే నటనపై ఆకర్షణతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓ చిన్నారి, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన ముద్దు ముద్దు ముఖంతో, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర కథానాయికగా ఎదిగింది. ఈ చిన్నారే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్ ఆసిన్. కేరళలోని కొచ్చిలో జన్మించిన ఆసిన్, భారతీయ సాంప్రదాయ నృత్యాల్లో ప్రావీణ్యం సాధించి,మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. కేవలం 15 ఏళ్ల వయసులో, 2001లో వచ్చిన మలయాళ చిత్రం నరేంద్రన్ మకన్ జయకాంతన్ వగా మకన్ ద్వారా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది.

ఆ సినిమా కమర్షియల్ హిట్ కావడంతో, ఆసిన్ తన నటనతో అందరి మన్ననలు పొందింది. 2003లో ఆసిన్ రవితేజ సరసన నటించిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో ఆసిన్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. సినిమా సక్సెస్‌తో ఆసిన్ క్రేజ్ అమాంతం పెరిగింది, ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డ్ కూడా అందుకుంది. తక్కువ సమయంలోనే ఆసిన్ తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

ఆమె రవితేజ, వెంకటేశ్, నాగార్జున, సూర్య, విజయ్, విక్రమ్ వంటి టాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరోలతో వరుసగా హిట్ సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌లోనూ అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర నటులతో కలిసి మెరిసింది.కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే ఆసిన్ తన జీవితం కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. సల్మాన్ ఖాన్ స్నేహితుడు, మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో ప్రేమలో పడి, 2016లో ఘనంగా వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పి తన కుటుంబ జీవనానికి పూర్తిగా సమర్పించుకుంది.

ఆసిన్‌కు ఓ పాప ఉంది, తన కుటుంబంతోనే ఆనందంగా గడుపుతోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆసిన్ తన అభిమానులతో ఫోటోలు, ప్రత్యేక క్షణాలను పంచుకుంటూ ఉంటుంది. సినిమాలకు దూరమైనప్పటికీ, ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆసిన్ ప్రస్తుతం దాదాపు 1300 కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి అని సమాచారం. అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ అందుకున్న ఆసిన్, కుటుంబ జీవితానికీ ప్రాధాన్యత ఇచ్చి, నటనలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

   lankan t20 league. But іѕ іt juѕt an асt ?. Dentist accused of killing wife allegedly wanted fake suicide notes planted.