హైదరాబాద్: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గురువారం సాయంత్రం నాంపల్లిలోని లలిత కళా తోరణం లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సోను సూద్ కు ఫౌండేషన్ అధినేత సుచిరిండియా కిరణ్ సంకల్ప్ కిరణ్ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుచిరిండియా అధినేత కిరణ్ మాట్లాడుతూ.. తాము రెండు దశాబ్దాలుగా సామాజిక వేత్తలను, మానవతా వాదులను గుర్తించి వారినీ సత్కరిస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయం లో వేలాది మంది నిరాశ్రయులకు సినీనటుడు సోనూ సూద్ అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు.. అంతటి విపత్తులో సోను సూద్ నీ చూసి ఎంతోమంది స్ఫూర్తి పొంది సేవలు చేశారని గుర్తు చేశారు.
కరోనా తర్వాత కూడా ఆయన తన ఫౌండేషన్ ల తరపున ఎంతోమంది పేదలకు, విద్యార్థులకు, మహిళలకు అండగా నిలిచారని ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ -బల్గేరియా రాయబారి నికోలయ్ యాంకోవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని 50 వివిధ బధిర పాఠశాలలకు చెందిన ప్రత్యేక బాలలు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు సోనూ సూద్ మాట్లాడుతూ.. తాము పంజాబ్ నుంచి వచ్చాను కానీ నేను ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎక్కువ ప్రేమించారు. నాకు తెలుగులో వారంటే చాలా అభిమానం. పక్కవారికి హెల్ప్ చేస్తూ ముందుకు సాగడం అదే పని గా సహాయం చేస్తూ ఉండటం అంతా సులువైన విషయం కాదు అన్నారు.