డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ సమావేశం

AP Cabinet meeting on 4th December

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్‌ సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా పంపాలని వివిధ శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ అమలులో లోటు పాట్లు, సూపర్ సిక్స్ పథకాలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌తో పాటు అదానీ వివాదం నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైనా చర్చించే అవకాశం ఉంది.

గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైనా చర్చించే అవకాశం ఉంది. అమెరికాలో కేసు నమోదుతో బహిర్గతమైన అదానీ సంస్థల ముడుపుల వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. పలు ప్రధాన అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయాలను తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іt іѕ always a lіttlе lаtеr thаn you think. Präsenz was ist das genau und wie kommt man dazu ? life und business coaching in wien tobias judmaier, msc. Latest sport news.