Popular Hindi actress goes

మరో జన్మంటూ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలి – జరీనా వహాబ్

బాలీవుడ్ నటి జరీనా వహాబ్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన లాంటి గొప్ప వ్యక్తిని ఎక్కడా చూడలేదని.. ప్రభాస్ ఒక డార్లింగ్. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంటుంది..అని జరీనా వహాబ్ చెప్పుకొచ్చారు. “రాజాసాబ్” సినిమాలో ప్రభాస్ తల్లిగా నటిస్తున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘ప్రభాస్ ఎంత గొప్ప మనిషి అంటే నేను ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు. సెట్ లో ప్రతిఒక్కరిని వారి క్రాఫ్ట్స్ తో సంబంధం లేకుండా సమానంగా చూసుకుంటారు. నాకు ఆకలేస్తుందని తెలిస్తే.. ఇంటికి ఫోన్ చేసి 40-50 మందికి ఫుడ్ తెప్పిస్తారు. వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకుకి తల్లి కావాలని కోరుకుంటా’ అంది. ప్రభాస్ పట్ల ఉన్న జరీనా వహాబ్ చేసిన కామెంట్స్ ఆయనపై మరింతఅభిమానం పెంచుకునేలా చేస్తున్నాయి.

ఇక జరీనా వాహబ్ పేరుకి హిందీ యాక్టర్ అయినా.. ఆమె తెలుగింటి అమ్మాయి. విశాఖపట్టణంలో పుట్టి పెరిగింది. తర్వాత బాలీవుడ్ యాక్టర్, ప్లే బ్యాక్ సింగర్, ప్రొడ్యూసర్ ఆదిత్య పాంచోలిని పెళ్లి చేసుకుంది. హిందీ, తమిళ్, మలయాళ భాషలతో పాటు తెలుగులో గాజుల కిష్టయ్య, అమర ప్రేమ, హేమ హేమీలు, రక్త చరిత్ర 2, విరాట పర్వం, దేవర సినిమాల్లో నటించింది.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే…

సలార్‌, కల్కి 2898 ఎ.డి సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. త్వరలోనే రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. వచ్చే నెలలో యూరప్‌లో ఓ సాంగ్​ను షూటింగ్​ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్, మాళవిక మోహనన్‌ మధ్య వచ్చే డ్యూయెట్‌ సాంగ్ ఇది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా తొలి గీతాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోదం నిండిన హారర్‌ థ్రిల్లర్‌ కథాంశంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీపై ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. Under et tandtjek kan dyrlægen anbefale at få tænderne “floatet”. The border would reopen to asylum seekers only when the number of crossings.