అదానీపై US కోర్టు కేసులో ఊహించని ట్విస్ట్

adani news

అదానీపై అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో మరో టర్న్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్పై US DOJ లంచం, అవినీతి అభియోగాలు నమోదే చేయలేదని అదానీ గ్రూప్ తెలిపింది. ఫారిన్ కరప్షన్, లంచాలపై భారత్, అమెరికా మీడియా చేస్తున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. మొత్తం 5 అభియోగాల్లో వారిపై మూడే నమోదయ్యాయని తెలిపింది. సెక్యూరిటీస్ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర, సెక్యూరిటీ ఫ్రాడ్ ఆరోపణలే ఉన్నాయనడం ఇప్పుడు దేశ వ్యపథంగా మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇండియాలోనే ధనవంతుల జాబితాలో అదానీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అలాంటి అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఏకంగా అమెరికా నుంచి అరెస్ట్ వారెంట్ నోటీసులు సైతం రావడం అందర్నీ షాక్ లో పడేశాయి.

20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల భారతదేశపు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం అమెరికాలోని ఇన్వెస్టర్లు, వరల్డ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి భారీగా నిధులు సేకరించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఆ కాంట్రక్ట్‌ను దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు రూ.2,100 కోట్ల లంచాలు చెల్లించినట్లు అమెరికాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా ఇన్వెస్టర్లను అదానీ మోసం చేసినట్లు అభియోగాలు వచ్చాయి. కాగా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అమెరికన్ సోలార్ ప్రొడక్షన్ కంపెనీలతో టైఅప్ అయి ఇండియాలో 20 ఏళ్ల వరకు సౌరశక్తి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ కాంట్రక్ట్ తనకే దక్కాలని అదానీ దాదాపు 2,100 కోట్లు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చాడని ఫారెన్ ఇన్వెస్టర్లు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే అమెరికా కోర్టులో ఏం జరిగిందో పరిశోధించింది. ఇందులో గౌతం అదానీపై నమోదైన నేర అభియోగాలతో పాటు అరెస్టు వారెంట్ ను గత నెలలోనే కోర్టు రద్దు చేసినట్లు తెలిసింది. అక్టోబర్ 31న వాటిని రద్దు చేయాలని న్యాయమూర్తి రాబర్ట్ ఎమ్ లెవీ ఆదేశించారని ఇండియా టుడే పేర్కొంది. విదేశీ చట్ట అమలు సంస్థలకు కేసు పత్రాలను అందించడానికి నేరారోపణ, అరెస్టు వారెంట్‌ను నిలిపేశారని తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా చట్టాల ప్రకారం నిందితులు స్వచ్ఛందంగా కోర్టుకు హాజరవుతారనే బలమైన అంచనా లేకపోతే కోర్టులు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తాయి.కానీ ఇక్కడ అలాంటి పరిస్ధితి లేదని యూఎస్ అటార్నీ జనరల్ కోర్టుకు నివేదించినట్లు తెలుస్తోంది. ఆయన సిఫార్సు ఆధారంగా గౌతం అదానీపై అరెస్టు వారెంట్ రద్దయినట్లు తెలుస్తోంది. మరోవైపు సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్ భారీగా రుణాలు సేకరించిన అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదారుల నుండి ఈ వాస్తవాన్ని దాచిపెట్టారని అమెరికా ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

ఇటు జగన్కు అదానీ రూ.1750 కోట్ల లంచం ఆరోపణల వివాదంలో మరో ట్విస్ట్. తమకు అదానీతో సంబంధం లేదని, సెకీతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామని జగన్ బృందం తెలిపింది. తమ ప్రతినిధులు భారత అధికారులకు లంచమిచ్చినట్టు US కోర్టులో అభియోగాలే నమోదవ్వలేదని తాజాగా అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అవి అజూర్ పవర్, CDPQ ప్రతినిధులపైనే ఉన్నాయంది. మరి జగన్ లంచం తీసుకున్నారా? తీసుకుంటే అదానీ కాకుండా ఎవరిచ్చినట్టు? అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Life und business coaching in wien – tobias judmaier, msc. Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket.