हिन्दी | Epaper
పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

నాని మూవీలో ‘మోహన్ బాబు’ ..నిజమేనా..?

Sudheer
నాని మూవీలో ‘మోహన్ బాబు’ ..నిజమేనా..?

‘దసరా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ తర్వాత హీరో నాని – దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో మరో ప్రాజెక్ట్ సిద్ధమైంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఖరారైంది. ‘ది ప్యారడైజ్‌’ అనే టైటిల్‌ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హీరో నాని టైటిల్‌ లోగోను ఎక్స్‌లో షేర్‌ చేశారు. అయితే శ్రీకాంత్‌ తొలి చిత్రం ‘దసరా’ కన్నా ‘ది ప్యారడైజ్’ మూవీలో మాస్ మోతాదు మరింత ఎక్కువగా ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే అరమైంది.

‘ది ప్యారడైజ్’ ఒక బోల్డ్, యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో తుపాకీలు పట్టుకుని కొందరు కనిపిస్తున్నారు. దీంతో ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ మూవీని హైదరాబాద్​లోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో కీలక పాత్రలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కనిపించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆయనకు స్టోరీ చెప్పగా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపాయి. జనవరి నుంచి ఆయన మూవీ షూట్లో పాల్గొంటారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మోహన్‌ బాబు ఇటీవలే తన కొడుకు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన ‘కన్నప్ప’ సినిమాలో కీలక పాత్రలో నటించారు. గత కొంత కాలంగా మోహన్‌ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. అందుకే హీరోగా నటించే ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది. విలన్‌ రోల్స్‌లో గతంలో మోహన్‌బాబు నటించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత నాని సినిమాలో మోహన్ బాబు విలన్‌గా కనిపించబోతున్నారు. మోహన్‌ బాబు ఎలాంటి పాత్రలో అయినా అద్భుతంగా నటించగల సత్తా ఉన్న నటుడు అనడంలో సందేహం లేదు. ‘ది ప్యారడైజ్’ మూవీ ని ఎస్‌ ఎల్ వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాని కెరీర్‌ లోనే అత్యధిక వ్యయంతో ఈ మూవీ రూపొందనున్నట్టు తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870