తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీ నుంచి ఓ భక్తుడు నగదు చోరీ చేశాడు. తమిళనాడుకు చెందిన వేణులింగం రూ.15వేలు తీసినట్లు అధికారులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ చేసి పరారయ్యాడు. సీసీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా చోరీ జరిగినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. దొంగిలించిన రూ.15వేల నగదును అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుమల తిరుపతి (టీటీడీ) విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. మూడు రోజుల క్రితం ఘటన జరగ్గా.. తాజాగా బయటపడింది. ఆ యువకుడ్ని అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. ఆ యువకుడు చేసిన నేరాన్ని ఒప్పుకోగా.. అతడి దగ్గర నుంచి రూ. 13,870 డబ్బుల్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
ఇక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీ భక్తులందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. దైవ నిధుల ప్రాముఖ్యమైన కేంద్రం. ఇది ప్రపంచంలో అత్యధిక విరాళాలు అందే ఆలయాలలో ఒకటి. భక్తులు తమ శక్తి కొలదీ తిరుమల హుండీలో నగదు, బంగారం, వెండి, ఆభరణాలు, విదేశీ కరెన్సీ వంటి విరాళాలను సమర్పిస్తారు. ఇది స్వామి పట్ల వారి భక్తిని వ్యక్తపరుస్తుంది. తిరుమల హుండీ ద్వారా రోజుకు సగటున రూ. 3-రూ.4 కోట్లు వరకు విరాళాలు సమకూరతాయి. ముఖ్య పండుగల సమయంలో ఇది మరింత పెరుగుతుంది. హుండీ విరాళాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తుంది. హుండీ ఆదాయాన్ని ఆలయ నిర్వహణ, ఆర్జిత సేవలు, విద్యా, వైద్య సేవల కోసం ఉపయోగిస్తారు. ఆలయ అవసరాలు, దాతృత్వ కార్యక్రమాలు, మరియు ధార్మిక విధానాల నిర్వహణకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇది తిరుమల శ్రీవారి ఆలయాన్ని ప్రపంచంలోని ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.