kantara team accident

‘కాంతార’ నటులకు ప్రమాదం..

‘కాంతార: ఛాప్టర్-1’ సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడటంతో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక జడ్కల్లోని ముదూర్లో షూటింగ్ ముగించుకుని కొల్లూరుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

రిష‌బ్ శెట్టి స్వియ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన కాంతార చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల నుంచి వ‌చ్చిన స్పంద‌న తో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను కూడా రాబ‌ట్టింది. అయితే ఇప్పుడీ కాంతార సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. ప్రస్తుతం ఈ సీక్వెల్ షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా కాంతార చాప్టర్ 1కు చెందిన ఆర్టిస్టులను తీసుకెళ్తున్న ఓ మినీ బ‌స్సు బోల్తా ప‌డింది. పోలీసులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు కర్ణాటకలోని జడకల్‌లోని ముదుర్‌లో షూటింగ్‌ ముగించుకుని కొల్లూరుకు తిరిగి వస్తుండగా ఈ ప్ర‌మాదం సంబ‌వించింది. ఈ మినీ బస్సులో సుమారు 20 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్​ను పూర్తి చేసుకుంది. అయితే ఈ టీమ్ మొత్తం ముదూరులో డ్యాన్స్​షూట్​కంప్లీట్ చేసుకుని కొల్లూరుకు తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్రమాదం జరిగిన‌ట్లు తెలుస్తోంది. ఎదురుగా వచ్చిన బైకును త‌ప్పించే క్ర‌మంలో మినీ బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తా పడినట్లు తెలిసింది. బ‌స్సులో ఉన్న‌వారంద‌రికీ స్వల్ప గాయాలయిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరంద‌రినీ జడ్కల్​మహాలక్ష్మీ క్లినిక్​లో ప్ర‌థ‌మ చికిత్స చేసిన‌ట్లు స‌మాచారం. అయితే, ఈ ప్రమాదంలో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులకు తీవ్ర గాయాల‌యిన‌ట్లు తెలుస్తోంది. వారిని మెరుగైన వైద్యం కోసం కుందాపుర్​హాస్పిటల్​కు తరలించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Febrefobia : entenda o medo dos pais sobre mudança de temperatura da criança – jornal estado de minas. Die technische speicherung oder der zugriff, der ausschließlich zu anonymen statistischen zwecken verwendet wird. Dinero por internet archives negocios digitales rentables.