Alien movie

ఏలియన్ మూవీ వేల కోట్ల వసూళ్లను చూసిన కంటెంట్

1979లో ప్రారంభమైన ఏలియన్ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన తాజా సినిమా ఏలియన్ రొములస్ , సైన్స్ ఫిక్షన్, హారర్, థ్రిల్లర్ జానర్స్‌కి నూతన ఒరవడి తీసుకొచ్చింది. గతంలో 1986, 1992, 1997, 2012, 2017లలో ఈ ఫ్రాంచైజీ నుంచి మరెన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.2017లో వచ్చిన ఏలియన్ కోవెనెంట్ తరువాత ఈ ఫ్రాంచైజీ నుండి ప్రేక్షకులు ఎదురుచూస్తున్న తాజా చిత్రం ఇది. 2023 ఆగస్టు 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఏలియన్ రొములస్ దాదాపు రూ.675 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది. విడుదల తర్వాత ఈ సినిమా రికార్డు స్థాయిలో రూ. 3,000 కోట్లకుపైగా వసూళ్లను సాధించి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది.

నేడు, నవంబర్ 21 నుండి ఈ చిత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఏలియన్ రొములస్ కథ 2142 సంవత్సరంలో సాగుతుంది.రెయిన్ (కైలీ స్పెనీ) అనే యువతి, తన సహజ సోదరుడిగా భావించే ఆర్టిఫిషియల్ వ్యక్తి ఆండీ (డేవిడ్ జాన్సన్)తో కలిసి ఉంటుంది. ఆండీకి ప్రత్యేకంగా స్పేస్‌షిప్‌లలో యాక్సెస్ ఉంటుంది, కానీ రెయిన్‌కు ఆ అవకాశాలు దూరమవుతాయి. ఈ కారణంగా రెయిన్ అసంతృప్తిగా ఉంటుంది. ఈ విషయం ఆమె మాజీ ప్రేమికుడు టేలర్ (ఆర్చీ రెనాక్స్)కు చెప్పడంతో, అతను ఒక పాత స్పేస్ స్టేషన్ గురించి ప్రస్తావిస్తాడు. అక్కడ విలువైన వస్తువులను తేవడానికి ఆండీ సహాయం అవసరం అవుతుందని తెలియజేస్తాడు.

ఆందోళనతో కూడిన పరిణామాల మధ్య, రెయిన్, టేలర్, ఆండీ, టేలర్ చెల్లెలు కెతో పాటు మరికొందరు ఆర్కిటెక్‌ లాంటి ఐదు మంది ఆ స్పేస్‌షిప్‌లో ప్రయాణం మొదలు పెడతారు.కొన్ని రోజుల ప్రయాణం తర్వాత, వారు ఆ స్పేస్‌స్టేషన్‌కి చేరుకుంటారు. అక్కడ, అది చాలా కాలంగా వాడుకలో లేని స్టేషన్ అని గ్రహిస్తారు. అయితే, స్టేషన్‌ను అన్వేషణ చేయడం మొదలు పెట్టిన వెంటనే వారు అక్కడ ఒక వింత జీవులతో ఎదుర్కొంటారు. ఈ జీవులు యాసిడ్‌ను రక్తంగా కలిగి ఉంటాయి మరియు మానవ శరీరాలను తీవ్రంగా నాశనం చేస్తాయి.

మరింత భయానకమైనది ఏమిటంటే, ఈ జీవులు మహిళలపై దాడి చేసిన కాసేపటికే వారి గర్భంలో ఏలియన్స్ పెరిగి బయటకు వస్తాయి. ఏలియన్ రొములస్ పూర్తి థ్రిల్ అనుభూతిని పంచేలా రూపొందించబడింది. దర్శకుడు ఫెడే అల్వారేజ్, ఇంతకుముందు ఈవిల్ డెడ్ మరియు డోంట్ బ్రీత్ వంటి భయానక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సైతం ఆ విధంగానే థ్రిల్ అంశాలతో నిండిపోయింది.

చిత్రంలో మొదటి గంట కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, ఏలియన్స్ ఎంట్రీ తరువాత కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. ప్రత్యేకించి, స్పేస్‌స్టేషన్‌లోని వాతావరణం, వాటిని చూడగానే ప్రేక్షకులను ఒక్కసారిగా అలర్ట్‌ చేస్తుంది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయి.ఫెడే అల్వారేజ్, గ్రావిటీ మరియు స్పేస్ థీమ్‌తో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్‌ను అత్యున్నతంగా ప్రదర్శించారు. నేపథ్య సంగీతం సినిమాకు కీలకమైన ఆకర్షణగా నిలిచింది.

పాత్రధారుల సహజ నటన, ముఖ్యంగా రెయిన్ పాత్రలో కైలీ స్పెనీ చేసిన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం, కథానాయికలపై దృష్టి పెట్టి, ప్రేక్షకులకు భయానక అనుభూతిని పంచుతుంది. ఏలియన్ ఫ్రాంచైజీకి తగ్గట్టుగా ఇది భయానకతను, సస్పెన్స్‌ను సమపాళ్లలో సమకూర్చింది. హారర్ చిత్రాలకు అలవాటు పడిన వారు తప్పకుండా చూడవలసిన సినిమా. “ఏలియన్ రొములస్” ఫ్రాంచైజీ అభిమానులకు మరో స్ఫూర్తిదాయక చాప్టర్‌ అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Febrefobia : entenda o medo dos pais sobre mudança de temperatura da criança – jornal estado de minas. Die technische speicherung oder der zugriff, der ausschließlich zu statistischen zwecken erfolgt. Ganando sin limites negocios digitales rentables.