Royal Challengers Banglaore

ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్పిదం.. టాప్ ప్లేయర్లని వదిలేసి లాస్ట్‌లో వెంపర్లాట

పీఎల్ 2025 మెగా వేలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చేదు అనుభవంగా మారింది. టాప్ ప్లేయర్ల కోసం భారీ బిడ్లు వేయాల్సిన సమయాల్లో నిష్క్రియంగా వ్యవహరించిన ఆర్సీబీ, చివరికి నిలకడలేని ఆటగాళ్లను ఎంచుకోవాల్సి వచ్చింది. ఇది అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ను రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేయడం మాత్రమే కాస్త సమర్థనీయంగా కనిపించింది. అయితే, వికెట్ కీపర్ జితేష్ శర్మ కోసం రూ.11 కోట్లు ఖర్చు చేయడంపై చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ (రూ. 11.5 కోట్లు), లియామ్ లివింగ్‌స్టోన్ (రూ. 8.75 కోట్లు), రసిక్ దార్ (రూ. 6 కోట్లు), సుయాష్ శర్మ (రూ. 2.6 కోట్లు)ల ఎంపికలు కూడా ఆశాజనకంగా లేవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.వేలంలో మొదటి రెండు సెట్లలో టాప్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నా, ఆర్సీబీ వారిని పట్టించుకోలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపడమే కాకుండా, కెప్టెన్సీ అనుభవం ఉన్న శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌ల కోసం కూడా బిడ్ వేయలేదు.

ఈ ముగ్గురిలో ఒకరిని కొనుగోలు చేయడం ద్వారా జట్టుకు సమతూకం తీసుకురావచ్చు. చివరికి నిలకడలేని పవర్ హిట్టర్లు, అనుభవం లేని బౌలర్లు, మరియు కనీస అనుభవం ఉన్న వికెట్ కీపర్ల కోసం కోట్లు వెచ్చించడం, ఆర్సీబీ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది.

సోషల్ మీడియాలో ఈ జట్టు ప్రణాళికలపై విమర్శలున్నాయి.ఆర్సీబీ కొనుగోళ్లు – ఐపీఎల్ 2025 జోష్ హేజిల్‌వుడ్: ₹12.5 కోట్లు ఫిల్ సాల్ట్: ₹11.5 కోట్లు జితేష్ శర్మ: ₹11 కోట్లు లియామ్ లివింగ్‌స్టోన్: ₹8.75 కోట్లు రసిక్ దార్: ₹6 కోట్లు సుయాష్ శర్మ: ₹2.6 కోట్లు ఇప్పటికే రిటైన్ చేసిన ఆటగాళ్లు విరాట్ కోహ్లీ: ₹21 కోట్లు రజత్ పాటిదార్: ₹11 కోట్లు యశ్ దయాళ్: ₹5 కోట్లు వేలంలో రూ. 52.35 కోట్లు ఖర్చు చేసిన ఆర్సీబీ, రిటెన్షన్ల కోసం రూ.37 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం జట్టు వద్ద రూ.30.65 కోట్లు మాత్రమే మిగిలి ఉండగా, ఇంకా 16 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది.అనుభవం కలిగిన ఆటగాళ్లను ప్రణాళికాబద్ధంగా ఎంచుకుంటే జట్టు బలంగా ఉండేదని అభిమానులు చెబుతున్నారు. ఈసారి చేసిన ఎంపికల వల్ల ఆటగాళ్ల అసమతూకతలపై జట్టు ప్రభావం పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uneedpi lösungen für entwickler im pi network. 500 dkk pr. , the parent to fox news and fox business.