PVR Inox introduced Movie Jockey MJ

మూవీ జాకీని (ఎంజే) పరిచయం చేసిన పివిఆర్ ఐనాక్స్ ..

పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్ మూవీ జాకీని (ఎంజే)ని ప్రారంభించింది. ఇది మూవీని కనుగొనడాన్ని మరియు భారతదేశంవ్యాప్తంగా ఉన్న మూవీ ప్రేమికులకు బుక్కింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు వ్యక్తిగతం చేయడానికి ఏఐ-మద్దతు గల చాట్ బాట్. హిందీ, ఇంగ్లిషు, కన్నడం, తమిళం, తెలుగు మరియు హింగ్లీష్ వంటి ఆరు భాషలలో వాట్సాప్ పై 24/7 లభిస్తోంది.

హైదరాబాద్‌: పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్, భారతదేశపు అతి పెద్ద మరియు అత్యంత ప్రీమియం సినిమా ఎగ్జిబిటర్, మూవీ జాకీని (ఎంజే)ని గర్వంగా ప్రకటిస్తోంది. ఇది ఏఐ-మద్దతు గల వాట్సాప్ చాట్ బాట్. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ఔత్సాహికుల కోసం మూవీని కనుగొనడానికి మరియు బుక్కింగ్ అభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది. వాట్సాప్ యొక్క ప్రసిద్ధి మరియు సౌకర్యాన్ని వినియోగించడం ద్వారా, ఎంజే అందుబాటులో ఉంచడానికి ప్రాధాన్యతనిస్తోంది, వ్యక్తిగత మూవీ సిఫారసులు స్వీకరించడానికి యూజర్లకు అవకాశం ఇస్తోంది. నిరంతరంగా బుక్కింగ్స్ చేస్తోంది మరియు అవసరమైన అన్ని మూవీ వివరాలను ఎంతో సులభంగా అందుబాటులో ఉంచుతోంది.

వాట్సాప్ లో 24/7 అందుబాటులో ఉండే ఎంజే హిందీ, ఇంగ్లిష్, కన్నడం, తమిళం మరియు తెలుగు భాషలలో మద్దతుతో మూవీల బుక్కింగ్ ను కనుగొనడానికి సరళం చేస్తోంది, పూర్తి ప్రక్రియను సాఫీ చేస్తోంది మరియు సినిమా ప్రేమికులకు మరింత సౌకర్యవంతంగా, మరింతగా వారు పాల్గొనేలా చేస్తోంది. భారతదేశంలో విస్తృతంగా వినియోగించబడు వాట్సాప్, ఈ ఏఐ-ప్రోత్సాహిత అసిస్టెంట్ కు సులభంగా అందుబాటులో ఉంచడాన్ని నిర్థారిస్తోంది. తమకు తెలిసి మరియు తాము విశ్వసించే మాధ్యమం ద్వారా సినిమాతో ఏ విధంగా యూజర్లు వ్యవహరిస్తారో మారుస్తోంది.

ఎంజే యొక్క దృఢమైన ఏఐ సామర్థ్యాలు యూజర్ల మూవీ ప్రాధాన్యతలు ఆధారంగా కు వ్యక్తిగత ప్రయాణాన్ని అందిస్తున్నాయి. చాట్ బాట్ ఆధునిక డిస్కవరీ ఫీచర్లు యూజర్ల శైలి, భాష, ప్రదేశం, సినిమా రూపం, మరియు షోటైమ్ సహా వారి ఎంపికలకు మూవీ సూచనలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఐమాక్స్, ఎంఎక్స్ 4డి, ONYX, ScreenX, ప్లేహౌస్ మరియు ఇంకా ఎన్నో విభిన్నమైన సినిమాల నుండి ఎంచుకోవడానికి కూడా ఇది యూజర్లకు అనుమతి ఇస్తుంది. సహజమైన, సంభాషణలు, ఆలోచనలు ద్వారా, ఎంజే యూజర్లు సులభంగా ఆప్షన్స్ ను ఎంచుకోవడానికి మరియు సినిమా ప్రాధాన్యతలు ఆధారంగా ఫిల్టర్ చేయడానికి సహాయపడటం ద్వారా బుక్కింగ్స్ ను మెరుగుపరిచింది. యూజర్లు తమ ఉత్తమమైన ఫార్మాట్ ను ఎంచుకోవడాన్ని నిర్థారించడానికి 2డి మరియు 3డి ఆప్షన్స్ మధ్యలో స్పష్టంగా తేడాను తెలియచేస్తుంది.

కనుగొనడానికి మించి, ఎంజే వీల్ ఛైర్- హితమైన షోల పై వివరణాత్మకమైన సమాచారం, ఖచ్చితమైన లభ్యత, మరియు అందుబాటులో ఉండే సీటింగ్ వంటి సమాచారం కేటాయిస్తుంది. అందరి కోసం సమీకృతమైన అనుభవాన్ని నిర్థారిస్తుంది. యూజర్లు కూడా రాబోయే విడుదలలను అన్వేషిస్తారు, ట్రైలర్లు చూస్తారు, సంగ్రహాలు చదువుతారు మరియు తారాగణం, రన్ టైమ్ మరియు సెన్సార్ షిప్ రేటింగ్స్ పై వివరాలు పొందుతారు- సంబంధిత సమాచారంతో అవగాహనతో కూడిన సమాచారం పొందడంలో వారికి సహాయపడుతుంది.

“అందుబాటులో ఉండటం మరియు వ్యక్తిగతీకరణలు మూవీ జాకీ అనుభవానికి కీలకం, కస్టమర్ ప్రయాణాన్ని డిజిటల్ – ప్రథమం ప్రపంచంలోకి మార్చడానికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది,” శ్రీ. సంజీవ్ కుమార్ బిజ్లి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ –పివిఆర్ ఐనాక్స్ అన్నారు.

“అత్యంత ప్రసిద్ధి చెందిన ప్లాట్ ఫాంగా వాట్సాప్, ఎంజే కోసం ఒక సహజమైన ఎంపిక, యూజర్లు కనక్ట్ అవడానికి మరియు మూవీస్ ను అన్వేషించడానికి సులభం చేసింది. ఏఐ ప్రధాన కేంద్రంగా, ఎంజే ప్రేక్షకులు మరియు వారి విలక్షణమైన సినిమా అభిరుచుల మధ్య అంతరాన్ని తగ్గించింది, ప్రతి అవుటింగ్ ఆనందదాయకంగా మరియు ఒత్తిడిలేకుండా నిర్థారిస్తోంది. మూవీలకు ఎంతో అభిమానంగా వెళ్లే వారి కోసం లేదా ఎప్పుడైనా సందర్శించే వారి కోసం కూడా ఎంజే కొత్త మూవీస్ ను సులభంగా కనుగొనడాన్ని, ఫార్మాట్ ఆప్షన్స్ ను చూడటం, భాషా ప్రాధాన్యతలు తనిఖీ చేయడం మరియు ఇంకా ఎన్నో వాటిని సులభం చేసింది.”

మూవీ జాకీ (ఎంజే)తో , పివిఆర్ ఐనాక్స్ తమ ఆవిష్కరణ మరియు కస్టమర్-ప్రధమం విధానం యొక్క వారసత్వాన్ని వినోదాత్మక పరిశ్రమలో కొనసాగించింది. 24/7 లభ్యతను మరియు యూజర్ హితమైన ఫీచర్లను నమ్మకమైన ప్లాట్ ఫాంపై అందిస్తోంది, మూవీ జాకీ ప్రేక్షకుల సినిమా అనుభవం విధానంలో భారీ మార్పులు కలిగించింది. వారాంతపు బ్లాక్ బస్టర్ కోసం ప్రణాళిక చేసినా లేదా వారం మధ్యలో కుటుంబ షో కోసం ప్రణాళిక చేసినా, ఎంజే సరికొత్త మూవీల నుండి కుటుంబ కామెడీల వరకు వివిధ శైలుల సినిమాలను సూచిస్తుంది- సాఫీ మరియు మరింత నిమగ్నమయ్యే సినిమా అనుభవాన్ని నిర్థారిస్తుంది.

మూవీ జాకీని యాక్సెస్ చేయడానికి, పివిఆర్ ఐనాక్స్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి, వారి యాప్ ద్వారా సంభాషణను ఆరంభించండి, లేదా 8800989898 పై వాట్సాప్ పై సందేశం పంపించండి మరియు సినిమా బుక్కింగ్ భవిష్యత్తును సులభంగా అనుభవించండి.

“యూజర్ల జీవితాలకు మేము ఎల్లప్పుడూ విలువ మరియు సౌకర్యాన్ని చేర్చడానికి మార్గాలను కోరుకుంటాము మరియు పివిఆర్ ఐనాక్స్ యొక్క మూవీ జాకీ ఈ దిశగా ఒక ఉత్తేజభరితమైన చర్య. బహుళ భాషల కోసం దాని శక్తివంతమైన ఏఐచే ప్రోత్సహించబడిన ఫీచర్లు మరియు మద్దతుతో, వాట్సాప్ పైన సంభాషణాపరమైన అనుభవాలను ఏ విధంగా ఉన్నాయో చాట్ బాట్ ప్రదర్శించడం భారతదేశంవ్యాప్తంగా ఉన్న యజర్ల కోసం ప్రయాణాన్ని సరళం చేస్తుంది. వారు నిరంతరంగా టిక్కెట్లను బుక్ చేయడానికి మరియు ఇంకా ఎన్నో చేయడానికి వీలు కల్పిస్తుంది- అన్నీ వారి వాట్సాప్ సంభాషణలలో”, అని శ్రీ. రవి గార్గ్, డైరెక్టర్, బిజినెస్ మెసేజింగ్, మెటా ఇండియా అన్నారు.

“వ్యాపార వృద్ధికి వీలు కల్పించడం మేము రేజర్ పేలో చేసే ప్రతి దానికి కీలకం. వ్యాపారాలకు సాధికారత కల్పించడానికి మేము నిరంతరంగా వినూత్నమైన విధానాలను పరిశీలిస్తున్నాం మరియు వారికి సరైన సాధనాలను ఆరంభిస్తున్నాం మరియు పివిఆర్ ఐనాక్స్ తో మా భాగస్వామం అనేది ఈ నిబద్ధతకు శక్తివంతమైన ప్రతిబింబం. సురక్షితమైన చెల్లింపులను నేరుగా మూవీ జాకీ (ఎంజే) అనుభవంలకి సమీకృతం చేయడం ద్వారా – వాట్సాప్ పైన పివిఆర్ ఐనాక్స్ యొక్క కొత్త ఏఐ- మద్దతు గల గైడ్ – వాట్సాప్ లో నేరుగా చెల్లింపులు చేయడానికి మేము కస్టమర్లకు వీలు కల్పిస్తున్నాం, ఇది అత్యధిక మార్పిడి రేట్లక దారితీస్తోంది. ఈ సహకారం వ్యాపారాలు వర్ధిల్లి, శక్తివంతమైన కస్టమర్ సంబంధాలను రూపొందించే ఆల్-ఇన్-వన్ ప్లాట్ ఫాం వైపుగా గణనీయమైన మార్పును సూచిస్తుంది, సాఫీ, వేగవంతమైన మరియు మరింత సురక్షితమైన చెల్లింపు అనుభవాన్ని అదే చాట్ లో కేటాయిస్తుంది”, అని శ్రీ ఖిలాన్ హరియా, ఎస్ విపి & పేమెంట్స్, ప్రోడక్ట్ హెడ్, రేజర్ పే అన్నారు.

“పివిఆర్ ఐనాక్స్ తో కలిసి, కస్టమర్లు నిరంతరంగా మూవీ టిక్కెట్లు బుక్ చేయడానికి, తమకు ఇష్టమైన స్నాక్స్ ఆర్డర్ చేయడానికి మరియు వాస్తవిక సమయం మద్దతును పొందడానికి మేము వీలు కల్పిస్తున్నాం. జెన్ ఏఐ-మద్దతు గల చాట్ బాట్ ఏవైనా సంక్లిష్టమైన, ఓపెన్-ఎండెడ్ సందేహాలను నిర్వహిస్తుంది. ఉదాహరణకు, యూజర్లు ఒక ప్రత్యేకమైన మూవీ తమకు దగ్గరగా ఉన్న సినిమా హాల్లో ప్రదర్శించబడుతోందా అని తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు ఇలా అడగవచ్చు: ‘ రేపు రాత్రి నాకు దగ్గరలో ప్రదర్శిస్తున్న ఇంగ్లిషు యాక్షన్ మూవీస్ నాకు చూపించండి’, మరియు వెంటనే దానికి సమాధానం పొందండి. ఈ పరివర్తనకు శక్తిని అందించడానికి, ప్రతి దశలో మూవీ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మరియు ఆనందదాయకంగా చేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము.” అని శ్రీ. స్వపన్ రాజ్ దేవ్, సహ-స్థాపకులు, జియో హాప్టిక్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menyikapi persoalan rempang, bp batam ajak masyarakat agar tetap tenang. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news.