డిసెంబ‌ర్ 9 నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9నుంచి మొదలుకాబోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుండటంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పధకాలు గురించి సభలో చర్చించే అవకాశం ఉంది. రైతురుణమాఫీ, కులగణనపై చర్చించే అవకాశం ఉంది. డిసెంబ‌ర్ 7వ తేదీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్తవుతుంది. దీంతో ఆ లోపే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

మ‌రోవైపు రాష్ట్రంలో పంచాయితీ ఎన్నిక‌ల‌పై ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కుల‌గ‌ణ‌న త‌ర‌వాత పంచాయితీ ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్లు స‌వ‌రించి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో పంచాయితీ ఎన్నిల‌క‌పై కూడా అసెంబ్లీలో చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆస‌రా పెన్ష‌న్, మ‌రికొన్ని హామీలు అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఆస‌రా పెన్షన్ ఇస్తున్న‌ప్ప‌టికీ గ‌త ప్ర‌భుత్వంలో ఇచ్చిన విధానాన్నే కొన‌సాగిస్తున్నారు. కాగా ఇప్పుడు పెన్షన్ కూడా పెంచి ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనపై చర్చించి ఆమోదించనున్నారు. దీని ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

个月前. Because the millionaire copy bot a. Opting for the forest river della terra signifies a choice for unparalleled quality and memorable experiences.