Bougainvillea Restaurant introduces a brand new menu for food lovers copy

భోజన ప్రేమికుల కోసం సరికొత్త మెనూని పరిచయం చేసిన బౌగెన్‌విల్లా రెస్టారెంట్

హైదరాబాద్ : వినూత్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందిన ప్రీమియం రెస్టారెంట్, బౌగెన్‌విల్లే , భోజన ప్రేమికుల కోసం సరికొత్త మెనూని పరిచయం చేసినట్లు వెల్లడించింది. రెండేళ్ళ క్రితం ఆహార ప్రేమికుల కోసం తమ తలుపులు తెరిచిన ఈ రెస్టారెంట్, స్థానిక మరియు ప్రపంచ రుచులను మిళితం చేసి ప్రత్యేకమైన రుచుల సమ్మేళనంతో వినూత్న భోజన అనుభవాన్ని సృష్టించడం ద్వారా భోజన ప్రియులకు అభిమాన రెస్టారెంట్ గా మారింది.

నిపుణులైన చెఫ్‌ల బృందంచే ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన ఈ మెనూ, అద్భుతమైన రుచుల కలయికతో మహోన్నత రుచుల ప్రయాణానికి వాగ్దానం చేస్తుంది. అతిథులు ఇప్పుడు సింగపూర్ చిల్లీ మడ్ క్రాబ్, క్రీమీ మఖ్నీ సాస్‌లో బటర్ చికెన్ టోర్టెల్లిని మరియు శాఖాహారులకు ఇష్టమైన రీతిలో గుమ్మడికాయ క్వినోవా ఖిచ్డీ వంటి వంటకాలను రుచి చూడవచ్చు. ఈ నూతన మెనూ లో ఉన్న ప్రత్యేక వంటకాల జాబితాలో క్రిస్పీ అవోకాడో వెడ్జెస్ వంటి స్టార్టర్లు మరియు హైదరాబాదీ మరగ్ వంటి మనోహరమైన సూప్‌లు కూడా ఉన్నాయి.

బౌగెన్‌విల్లా రెస్టారెంట్ మాతృసంస్థ , జూసీ సహ వ్యవస్థాపకురాలు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అపర్ణా గొర్రెపాటి మాట్లాడుతూ ” ఆహారం ద్వారా మరపురాని అనుభవాలను సృష్టించాలని మేము బౌగెన్‌విల్లా రెస్టారెంట్‌ వద్ద విశ్వసిస్తున్నాము. ఆవిష్కరణ పట్ల మా అభిరుచిని , అతిథులకు సాంప్రదాయ మరియు సమకాలీన రుచుల సామరస్య సమ్మేళనాన్ని అందించడంలో మా నిబద్ధతను ఈ కొత్త మెనూ ప్రతిబింబిస్తుంది. ప్రతి వంటకం, ప్రతి ఒక్కరి అభిరుచులకు తగినట్లుగా ఉండేలా ఆలోచనాత్మకంగా రూపొందించబడింది” అని అన్నారు.

ప్రారంభమైనప్పటి నుండి, బౌగెన్‌విల్లా రెస్టారెంట్ దాని సొగసైన వాతావరణం, అతిథులకు అద్వితీయ అనుభవాలను అందించేటటువంటి సేవలు మరియు ఆకట్టుకునే వంటకాలతో నగరవాసుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శ్రేష్ఠత పట్ల రెస్టారెంట్ అంకితభావాన్ని తాజా మెనూ ప్రతిబింబిస్తుంది. బౌగెన్‌విల్లా రెస్టారెంట్‌ని సందర్శించండి. దాని కొత్త మెనూ యొక్క కళాత్మకతను ఆస్వాదించండి, ఇక్కడ ప్రతి వంటకం, అభిరుచి, సంప్రదాయం మరియు సృజనాత్మకత యొక్క కథను చెబుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Integration des pi network für weltweite zahlungen. 500 dkk pr. Woman vandalizes israeli hostage posters right in front of captives’ own family in new york city.