ముంబైలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, బిజినెస్ దిగ్గజాలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ.. ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య అంజలి, కూతురు సారా టెండూల్కర్ తో కలిసి ఆయన ముంబైలో ఓటేశారు. ఓటర్లంతా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేసి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అభ్యర్థించారు. అలాగే ప్రముఖ నటుడు సోనూసూద్ ఓటు హక్కును వియోగించుకొని, ప్రజలను ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. జాన్ అబ్రహం, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్. కబీర్ ఖాన్, రాజ్ కుమార్ రావ్, గౌతమీ కపూర్, అక్షయ్ కుమార్, అలి ఫజల్ మొదలైన వారు ముంబయి పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు.

రాజకీయ నేతల విషయానికి వస్తే..

ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మరియు బాబా సిద్ధిఖీ తనయుడు జీషాన్ సిద్ధిఖీ తమ ఓటు హక్కు వినియోగించారు.బారామతిలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించారు.మహారాష్ట్ర సీఈవో చొక్కలింగం కూడా ఓటేశారు. ఝార్ఖండ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బాబులాల్ మరాండి గిరిధిహ్‌లో ఓటు హక్కును వినియోగించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తొలిఘంటల్లోనే ఓటు హక్కు వినియోగించడం విశేషం.

ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఉద్యమ నుండి పోలింగ్ జరుగుతుంది. మొత్తం 4,136 మంది అదృష్టం పోటీ చేస్తున్నారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. అందుకే 1,00,186 పోలింగ్‌ బూత్‌లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. అలాగే ఇదే రోజు ఝార్ఖండ్‌లో 38 స్థానాలకు గాను రెండో విడత పోలింగ్ జరుగుతుంది.

మహారాష్ట్రలో బీజేపీ, అజిత్​ పవార్​-ఎన్​సీపీ, ఏకనాధ్​ శిందే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్​, శివ సేన (యూబీటీ), ఎన్​సీపీ (శరద్ పవార్​) కలిసి మహావికాస్​ అఘాడీగా ఏర్పడ్డాయి. దీంతో ఈసారి మహారాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ (MVA)లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్‌ పవార్‌కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి. కాంగ్రెస్‌ 101 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. శివసేన యూబీటీ 95 మందిని, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 86 మందిని పోటీకి దించింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా, ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

精选. Free buyer traffic app. New 2025 forest river blackthorn 26rd for sale in arlington wa 98223 at arlington wa bt102.