న్యూఢిల్లీ: నేడు అనగా 19 నవంబర్ 2024, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటున్నారు. సమాజంలో పురుషుల సహకారాన్ని ప్రశంసించే లక్ష్యంతో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కుటుంబం, సమాజం, దేశం నిర్మాణం, అభివృద్ధిలో పురుషుల పాత్ర ముఖ్యమైనది. గత కొన్ని దశాబ్దాలుగా, మహిళా సాధికారత కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, పురుషుల ఆరోగ్యం, పురోగతిపై కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురుషుల మానసిక వికాసం, సానుకూల గుణాల ప్రశంసలు, లింగ సమానత్వం లక్ష్యంగా జరుపుకుంటారు.
ఇకపోతే..అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 1992లో ట్రినిడాడ్ కు చెందిన డాక్టర్ జెరోమ్ టీలక్సింగ్ ప్రారంభం అయ్యింది. పురుష ఆరోగ్యం, వారిపై జరిగే హింస గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు. మహిళల విజయాలను నిర్వహించుకోవడానికి ఒక రోజు ఉన్నట్లే పురుషుల విజయాలను నిర్వహించేందుకు ఒక రోజు ఉన్నట్లే, పురుషుల విజయాలను, సహకారాలను గుర్తించడానికి ఒక రోజును అంకితం చేశారు. అలా ఉద్భవించిందే నేషనల్ మెన్స్ డే. ఈ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి నచ్చడంతో ఎన్నో దేశాలు ఈరోజును నిర్వహించుకోవడం మొదలుపెట్టాయి.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజున పురుషులు తమ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమాజంపై మగవారు చూసే సానుకూల ప్రభావాన్ని కూడా గుర్తించాలని ఈ ప్రత్యేక దినోత్సవం గుర్తుచేస్తోంది. ఇది మానసిక ఆరోగ్యం, స్టీరియోటైప్లను సవాలు చేయడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం వంటి క్లిష్టమైన సమస్యలను చర్చించేందుకు పురుషులకు ఒక వేదికలా మారింది ఈ దినోత్సవం. పురుషులకు సామాజికంగా కలిగే ఒత్తిళ్ల గురించి పరిష్కరించేందుకు బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. స్వచ్చంద సేవ, సామాజిక సమావేశాలు, బహిరంగ ప్రచారాలు వంటి కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా నేషనల్ మెన్స్ డే నిర్వహించుకుంటున్నారు. పురుషుల ఆరోగ్యం గురించి కొన్ని ఉచిత వైద్య తనిఖీలను చాలా చోట్ల ఏర్పాటు చేస్తారు.