The girl was raped by her u

బాలిక పై మేనమామ అత్యాచారం

ఏపీలో మహిళలపై , అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలుఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న కామాంధులు మాత్రం మారడం లేదు. పోలీసులు , కోర్ట్ లు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న వారు మాత్రం బెదరడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా తాడేపల్లిగూడెం లో వరుసగా మేనమామ అయ్యే వ్యక్తి..9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పై అత్యాచారం చేసాడు.

బాలికకు వరుసకు మేనమామైన కమల్​ తాడేపల్లిగూడెం మండలంలోనే ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు బాలిక ఇంటి దగ్గరకు వచ్చేవాడు. బాలిక ఆధార్ ​కార్డులో మార్పులు చేయాల్సి రావడంతో ఈ నెల 14న ఆమె అమ్మమ్మ కమల్​కు రూ.100 ఇచ్చి పంపించి ఆధార్ కార్డు పని చేయాల్సిందిగా కోరింది. దాన్నే ఆసరాగా తీసుకున్నాడు కమల్. దీంతో ఆయన వసతి గృహానికి చేరుకుని బాలికను బైక్ పై ఎక్కించుకుని చాగల్లు మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాలికను తాడేపల్లిగూడెం మండలంలోని ఆమె అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండటంతో అమ్మమ్మ ఏం జరిగిందని అడగ్గా, కమల్ చేసిందంతా వివరించింది. బాలికను నమ్మించి ఆధార్ పని మీద అతనితో ఇచ్చి పంపించడమే తప్పైంది అంటూ బాలిక అమ్మమ్మ విలపించింది. దీంతో బాలికను నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమల్​పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.నరేంద్ర తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Integration des pi network für weltweite zahlungen. Hest blå tunge. Mayor adams’s feud with city council takes petty turn over chairs.