ఏపీ సీఎం చంద్రబాబు కు కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్ చేసారు. చంద్రబాబు తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి మృతితో తీవ్ర విషాదంలో మునిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ..బాబు కు ఫోన్ చేసి పరామర్శించారు. విషాదంలో ఉన్న చంద్రబాబు కుటుంబానికి రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇక రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణ వార్త తెలిసి..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు..అక్కడి నుండి హుటాహుటిన హైదరాబాద్ కు రావడం జరిగింది.
అలాగే రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకోవడం జరిగింది. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. తన తమ్ముడి భౌతికకాయం చూసి చంద్రబాబు బోరున విలపించారు. తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారులు నారా రోహిత్, గిరీశ్ లను అక్కన జేర్చుకుని ఓదార్చారు. తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ ఇద్దరు సోదరులకు పెదనాన్నగా ధైర్యం చెప్పారు. ఈరోజు ఉ.5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని రేణిగుంట ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తరలిస్తున్నారు. మద్యాహ్నం రాంమూర్తి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొననున్నారు.