టీడీపీ పార్టీ ఆఫీస్ లో రామ్మూర్తి నాయుడుకు సంతాపం తెలిపిన నేతలు

రామూర్తినాయుడి మృతి పట్ల టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ.. రామూర్తినాయుడి చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. పేదల గొంతుకగా.. పేదల మనిషిగా సీఎం చంద్రబాబుకు సోదరుడిగా.. ప్రతిక్షణం మంచికోసం.. మంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం పరితపించిన వ్యక్తి నారా రామ్మూర్తి నాయుడు అని.. అలాంటి వ్యక్తి హఠాత్తుగా కన్నుమూయడం బాధాకరమని ఈ సందర్బంగా పార్టీ నేతలు వాపోయారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేట్ అథారిటీ ఛైర్మన్ శ్యావల దేవదత్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, హ్యాడ్ లూమ్ కోఆపరేటీవ్ చైర్ పర్సన్ సజ్జా హేమలతా, మౌనార్టీ సెల్ ప్రెసిడెంట్ ముస్తాక్ అహ్మద్, మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, టీడీపీ కేంద్ర కార్యాలయ రిసెప్షన్ ఇన్చార్జ్ హాజీ హసన్ బాషా, ఎన్ఆర్ఐ సెల్ చప్పిడి రాజశేఖర్, పార్టీ నాయకులు శంకర్ నాయుడు, రవియాదవ్, ములక సత్యవాణి, పీరయ్య సుభాషినీ తదితరులు పాల్గొని నివాళ్లు అర్పించారు.

రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణ వార్త తెలిసి..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు..అక్కడి నుండి హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు.

అలాగే రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకోవడం జరిగింది. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. తన తమ్ముడి భౌతికకాయం చూసి చంద్రబాబు బోరున విలపించారు. తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారులు నారా రోహిత్, గిరీశ్ లను అక్కన జేర్చుకుని ఓదార్చారు. తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ ఇద్దరు సోదరులకు పెదనాన్నగా ధైర్యం చెప్పారు. రేపు ఉ.5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని రేణిగుంట ఎయిర్పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు.

1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడు. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

流市场?. Profitresolution daily passive income with automated apps. 2025 forest river puma 403lft.