హీరోయిన్ సమంత జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆమె సినీ ప్రయాణం నుంచి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తుంటాయి. తెలుగులో టాప్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సమంత, ప్రేమలో పడిన తర్వాత హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నారు. 2017లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అందరూ నాగ చైతన్య, సమంత జంటను ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్‌గా వర్ణించుకుంటుండగా, వారి సంసారం అనూహ్యంగా ముగిసింది. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, అభిప్రాయ భేదాలు వీరి జీవితాలను వేరు చేశాయి.
అక్టోబర్ 2021లో, ఈ జంట విడాకుల ప్రకటన చేయడం అనేకమందిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ సంఘటన తర్వాత సమంత ఒంటరిగా ఉంటూ తన కెరీర్‌పై దృష్టి పెట్టారు.విడాకుల తర్వాత, నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగులు వేస్తూ, నటి శోభిత ధూళిపాళ్లతో బంధంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, గురువారం నాడు వీరి నిశ్చితార్థం చాలా సన్నిహితంగా, కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు, సమంత మాత్రం ఇంకా సింగిల్‌గానే కొనసాగుతూ తన ప్రొఫెషనల్ జీవితంలో ముందుకు సాగుతున్నారు. సమంత గతంలో హీరో సిద్ధార్థ్‌తో ప్రేమ సంబంధం కొనసాగించారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రత్యేకంగా గుడిలో పూజలు నిర్వహించడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కానీ అజ్ఞాత కారణాలతో ఈ సంబంధం కూడా విరిగిపోయింది.ఆ తర్వాత నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి చేసుకున్న సమంత, చివరికి అతనితోనూ విడిపోవడం జరిగింది.సమంత తన టీనేజ్ రోజుల్లో ఎదుర్కొన్న ఒక మధురమైన సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆమె స్కూల్ రోజుల్లో ఒక యువకుడు ఆమెను రెండు సంవత్సరాలు వరుసగా ఫాలో అయ్యేవాడట. కానీ ఆ సమయంలో ఒక్కసారి కూడా మాట్లాడలేదట. ఓ రోజు, ఎందుకు తనను ఫాలో అవుతున్నావని ఆ యువకున్ని సమంత ప్రశ్నించగా, అతను “నేను నిన్ను ఫాలో అవుతున్నానని ఎవరు చెప్పారు?” అంటూ ఎదురు ప్రశ్న చేసాడట. అతని మాటలకు సమంత ఆశ్చర్యపోవడంతో పాటు, బాధపడినట్టు చెప్పుకొచ్చింది. అయితే, ఆ సంఘటన ఆమెకు విచిత్రమైన అనుభవంగా మిగిలిందని, అదే సమయంలో ఒక మధుర జ్ఞాపకంగా భావిస్తానని తెలిపారు. ఇప్పటి పరిస్థితుల్లో సమంత తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టి, సినిమాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆమె పంచుకున్న అనుభవాలు, ఆమె జీవన ప్రయాణం, మరియు వ్యక్తిగత నిర్ణయాలు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.