teliyadu gurtuledu marchipoya launched with a ceremonial pooja 2

పూజా కార్యక్రమాలతో మొదలైన కామెడీ ఫిల్మ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాలోని చారీ పాత్రలో ఆయన చెప్పిన తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా అనే డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఇదే డైలాగ్‌ను శీర్షికగా తీసుకుని, నివాస్, అమిత శ్రీ జంటగా ఓ వినోదాత్మక సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘుబాబు, భరద్వాజ్, ఖయ్యూం వంటి ప్రఖ్యాత నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాను చెన్నా క్రియేషన్స్ బ్యానర్‌పై శరత్ చెన్నా నిర్మిస్తుండగా, దర్శకుడు వెంకటేశ్ వీరవరపు ఫుల్-లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్ ఇవ్వగా, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ కెమెరా స్విచ్ చేశారు.నటుడు పృథ్వీ మాట్లాడుతూ, మంచి కథ, కథనాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిర్మాత శరత్ చెన్నా గారు ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నవ్వులు పూయించేలా రూపొందిస్తున్నారు అని అన్నారు. దర్శకుడు వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ, ఈ చిత్రం వినోదాత్మకంగా, ఆసక్తికరమైన ట్విస్టులతో సాగుతుంది. ఈ నెల 18వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

మా చిత్రానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపారు.హీరోయిన్ అమిత శ్రీ మాట్లాడుతూ, ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది. మంచి అవకాశాన్ని అందించినందుకు దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. హీరో నివాస్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం నాకు గర్వంగా ఉంది. మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.నిర్మాత శరత్ చెన్నా మాట్లాడుతూ, సినిమా పేరులో ‘గుర్తు లేదు’ ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండేలా ఉంటుంది. యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్‌తో ఈ సినిమా ఒక పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్మకంగా ఉన్నాను అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Integration des pi network für weltweite zahlungen. For enhver hesteejer, der søger at optimere driften af sin ejendom, er croni minilæsseren en uundværlig hjælper. Giant step for somalia with un security council seat facefam.