శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయం, కొచ్చి వరకు మొత్తం 26 ప్రత్యేక రైళ్లను నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటాయని అధికారికంగా వెల్లడించారు.
రైళ్ల వివరాలు చూస్తే..
కాచిగూడ-కొట్టాయం (07131/07132)
నవంబర్ 17, 24: ఆదివారం మధ్యాహ్నం 12.30కు కాచిగూడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30కి కొట్టాయంలో చేరుతుంది.
కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ (07133/07134)
నవంబర్ 18, 25: సోమవారం రాత్రి 8.50కి కాచిగూడ నుంచి బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం 1.00కు కొట్టాయంలో చేరుతుంది.
హైదరాబాద్-కొట్టాయం-హైదరాబాద్ (07135/07136)
నవంబర్ 19, 26: మంగళవారం మధ్యాహ్నం 12.00కు హైదరాబాద్ నుంచి బయలుదేరి, బుధవారం సాయంత్రం 4.00కి కొట్టాయంలో చేరుతుంది.
సికింద్రాబాద్-కొట్టాయం-సికింద్రాబాద్ (07137/07138)
నవంబర్ 16, 23, 30: శనివారం రాత్రి 9.45కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, సోమవారం రాత్రి 12.50కి చేరుతుంది.
నాందేడ్-కొల్లం-సికింద్రాబాద్ (07139/07140)
నవంబర్ 16న నాందేడ్‌లో, నవంబర్ 18న కొట్టాయంలో బయలుదేరుతుంది.
మౌలాలి-కొల్లాం-మౌలాలి (07141/07142)
నవంబర్ 23, 30 తేదీల్లో మౌలాలి నుంచి బయలుదేరుతుంది.