కర్మ అంటే ఇదే… రఘురామ – డిప్యూటీ సీఎం పవన్

కర్మ ఫలం ఎవర్ని వదిలిపెట్టదని..ఎప్పుడు.. ఎలా జరగాలో అదే జరుగుతుందని..ఈ విషయంలో రఘురామకృష్ణం రాజే ఉదాహరణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురువారం ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కె. రఘురామకృష్ణరాజు ప్రకటన అనంతరం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగుపెట్టనివ్వబోమని సవాల్ చేసిన వారు ఈరోజు మీ ముందు అసెంబ్లీలోనే లేరని… కర్మ అంటే ఇదే. రఘురామ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నిక కాగా, రఘురామ ముందుకు వారు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది దేవుడు రాసిన స్క్రిప్టు… ఇది ప్రజాస్వామ్యం గొప్పదనం అని పవన్ వివరించారు.

“గత ప్రభుత్వంలో మనమందరం ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం… గత ప్రభుత్వ హయాంలో రాజకీయాలు కలుషితం అయ్యాయి… ఎన్ని కష్టాలు ఎదురైనా మీ పోరాట పటిమ అభినందనీయం… ఉండి అసెంబ్లీ స్థానం నుంచి 56 వేలకు పైగా మెజారిటీతో మీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆ పదవికి వన్నె తెచ్చి, సభను గౌరవ సభగా ఉన్నత స్థానానికి చేర్చుతారని ఆశిస్తున్నాను. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదని 2014లో వారిని నిలువరించామన్నారు. అయితే 2019లో అలా కుదరలేదని.. ఆ సమయంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగాయని అన్నారు.

సుప్రీంకోర్టు జడ్జీలు, పార్టీల్లోని కార్యకర్తలు, సొంత పార్టీ ఎంపీ అయిన ట్రిపుల్ ఆర్‌ను వారు వదల లేదన్నారు. ఆయన్ని శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా హింసించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ట్రిపుల్ ఆర్‌ను అరెస్ట్ చేస్తారనుకున్నాం.. కానీ థర్డ్ డిగ్రీ మెథడ్ వాడడంతో భయం కలిగిందన్నారు. దీంతో తామకు ఆవేదన కలిగిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న తన కోరిక వల్లే.. నేడు డిప్యూటీ స్పీకర్‌గా మిమ్మల్ని చూస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అందరం కలసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఈ సభకు ధన్యవాదాలు తెలిపారు. ఇక మీ మాటకు పదనుతోపాటు హస్యం సైతం ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *