Election of AP Deputy Speaker today. Raghurama Krishnam Raju will be announced as Speaker

నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.. రఘురామ కృష్ణంరాజును ప్రకటించనున్న స్పీకర్

అమరావతి: ఈరోజు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా ప్రకటిస్తారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ప్రశ్నోత్తరాల అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం 5 బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయ చట్ట సవరణ బిల్లు -2024, ఏపీ ఆయుర్వేదిక్, హోమియో ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు -2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ చట్ట సవరణ బిల్లు -2024ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు -2024, ఏపీ విద్యుత్ సుంకం చట్ట సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ MSME పాలసీ 4.0పై ప్రకటన చేయనున్నారు. మంత్రి టీజీ భరత్.. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీలపై ప్రకటన చేయనున్నారు. 2024-25 బడ్జెట్ పై నేడు అసెంబ్లీలో చర్చించనున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి పదవికి ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ బుధవారం మూడు నామినేషన్ దాఖలు అయ్యాయి. ఈ మేరకు మూడు పార్టీల నేతల సమక్షంలో రఘురామ మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉప సభాపతి పదవికి వీరి పేరు ఖరారు కావడంతో ఎన్డీఏ కూటమి మూడు పార్టీలకు చెందిన పలువురు మంత్రుల నేతృత్వంలో శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కు ఆయన తరపున నామినేషన్ పత్రాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. Sikkerhed for både dig og dine heste. Kenya news facefam.