కాళోజీ సేవలను స్మరించుకున్న కేసీఆర్‌

KCR pays tribute to Kaloji Narayana Rao his death anniversary

హైదరాబాద్‌ : నేడు కాళోజీ వర్ధంతి. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ అస్తిత్వం, సాహిత్య గరిమను ప్రపంచానికి చాటారని అన్నారు. తోటి మనిషి బాగును కోరుకోవడమే కాళోజీకి మనం అందించే నివాళి అని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. కవిగా తన కలాన్ని, గళాన్ని, జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించారు. తెలంగాణ అస్తిత్వం, సాహిత్య గరిమను ప్రపంచానికి చాటారు. కాళోజీ స్ఫూర్తి భవిష్యత్‌ తరాలకు అందించడానికి కృషి చేశాం. తెలంగాణ సమాజం కోసం వారు పడిన తపన, వారు అందించిన పోరాట స్ఫూర్తి, మలిదశ ఉద్యమంలో అనంతరం బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఇమిడి ఉంది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పలు కార్యక్రమాలను చేపట్టింది. తోటి మనిషి క్షేమాన్ని కోరుకోవడం, సబ్బండ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కాళోజీకి మనం అందించే ఘన నివాళి’ అని చెప్పుకొచ్చారు.

మరోవైపు ప్రజా గొంతుక.. ధిక్కార ప్రతీక కాళోజీ అని కేటీఆర్‌ అన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మలిచి, మాటల తూటాలతో ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని ధారబోసిన యోధుడు మన కాళన్న అని కేటీఆర్‌ అన్నారు . కవిగా, రచయితగా సమాజంలోని అన్యాయాలకు, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పరితపించిన అక్షర తపస్వి కాళోజీ నారాయణ రావు అని కొనియాడారు.

తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ జయంతిని (సెప్టెంబర్ 9) కేసీఆర్ గారు తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారని గుర్తుచేశారు.. వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టారని అన్నారు. వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా కాళోజీ అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు సదా స్మరణీయమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??. This brand new business model is the fastest, simplest and least expensive way to start earning recurring income. 2025 forest river rockwood mini lite 2515s.