బీజేపీ సభలో జేబుదొంగల బీబత్సం

midhun chakravarthi
 




ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలోచేదు అనుభవం ఎదురైంది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరఫున మిథున్ చక్రవర్తి ప్రచారానికి రాగా.. ఆయన పాల్గొన్న సభలో జేబుదొంగలు తమ చేతివాటం చూపించారు. ప్రచారానికి వచ్చిన కార్యకర్తల పర్సులే కాదు మిథున్ పర్సు ను కూడా మాయం చేసారు.

ఇక తన పర్సు పోయిందన్న విషయాన్ని మిథున్ చక్రవర్తి సభ నిర్వాహకులకు తెలియజేశారు. దాంతో, నిర్వాహకులు పలుమార్లు మైక్ లో ప్రకటించారు. “మిథున్ చక్రవర్తి పర్సు ఎవరు తీసుకున్నారో దయచేసి తిరిగి ఇవ్వండి” అంటూ విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర నిరాశకు గురైన మిథున్ చక్రవర్తి నిర్ణీత సమయం కంటే ముందు సభ నుంచి వెళ్లిపోయారు.

ఇక ఝార్ఖండ్ లో మెుదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 13న పోలింగ్ జరగనుండటంతో 43 నియోజకవర్గాల్లో ప్రచారానికి తెర పడింది. ఎన్నికల బరిలో 685 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాల చొరబాట్ల అంశాన్ని BJP విస్తృతంగా లేవనెత్తింది. సంతాల్ పరగణాలు, కొల్హాన్ ప్రాంతాల్లో ఈ సమస్య భారీగా ఉందని.. రాష్ట్రాన్ని ధర్మసత్రంగా మారుస్తున్నారని మండిపడింది.

ఓట్ల కోసమే అక్రమ చొరబాటుదారులకు కాంగ్రెస్ , ఆర్జేడీలతో కూడిన జేఎంఎం ప్రభుత్వం ఆశ్రయమిస్తోందని ఆరోపించింది. BJP విమర్శలను తిప్పికొట్టిన JMM.. ఈ అంశాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయడం లేదంటూ BJPపై ఆరోపణలు గుప్పించింది. కేంద్రంలోని BJP ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని సీఎం హేమంత్ సోరెన్ ఆరోపించారు. ఝార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలి విడతలో 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

మొదటి దశలో మొత్తం 43 స్థానాలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 15,344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 1 కోటి 37 లక్షల 10వేల 717 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 68,73,455 మంది పురుష ఓటర్లుండగా..68,36,959 మంది మహిళా ఓటర్లు, 303 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Hаrrу kаnе іѕ mоdеrn england’s dаd : but is іt tіmе fоr hіm to соnѕіdеr stepping аѕіdе ? | ap news. Us military airlifts nonessential staff from embassy in haiti. Latest sport news.