Nirmalamma exercises on the budget.meeting with the finance ministers of the states soon

బడ్జెట్‌ పై నిర్మలమ్మ కసరత్తులు..త్వరలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలాసీతారామన్‌ భేటి కానున్నట్లు సమాచారం. డిసెంబర్ 21-22 తేదీల్లో ఈ సమావేశం ఉండనుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌లో ఈ సంప్రదింపులు జరగనున్నాయి.

మరోవైపు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్రాలు తమ సూచనలు తెలియజేసేందుకు రెండురోజుల పాటు ఆర్థిక మంత్రులతో సీతారామన్ భేటీ కానున్నారు. ఆ సమయంలోనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈసారి జరగబోయేది 55వ జీఎస్టీ మండలి సమావేశం. ఇదిలాఉంటే.. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నవేళ సెప్టెంబర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు. కానీ, దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మండలి.. మంత్రుల బృందానికి ఆ బాధ్యతను అప్పగించింది.

కాగా, గత నెలలో, ఆరోగ్య మరియు జీవిత బీమా జీఎస్టీపై మంత్రుల బృందం (GoM) టర్మ్ జీవిత బీమా పాలసీలకు చెల్లించే బీమా ప్రీమియంలను మరియు జీఎస్టీ నుండి సీనియర్ సిటిజన్‌ల ఆరోగ్య బీమాను మినహాయించడంపై విస్తృతంగా అంగీకరించింది. అలాగే, రూ. 5 లక్షల వరకు కవరేజీతో ఆరోగ్య బీమా కోసం సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులు చెల్లించే ప్రీమియంలపై జీఎస్‌టీని మినహాయించాలని ప్రతిపాదించారు. అయితే, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆరోగ్య బీమా కవరేజీ ఉన్న పాలసీలకు చెల్లించే ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. Hest blå tunge. Biden is failing because he simply hasn’t produced for anyone.