న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ప్రజ్వల్ రేవణ్ణకు ఈరోజు సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.
కాగా, ఈ కేసులో ట్రయల్ కోర్టు ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వకపోవడంతో రేవణ్ణ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడి ధర్మాసనం.. వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి వ్యాఖ్యానించింది. గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అక్టోబర్ 21న కర్ణాటక హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ప్రజ్వల్ రేవణ్ణ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఇక, ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ ఇవ్వడం వలన సిట్ దర్యాప్తులో ప్రాధాన్యం తప్పకుండా ఉంటే, జ్యుడిషియల్ ప్రాసెస్‌కి సంబంధించిన వివిధ అంశాలు కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంటుంది.
ఇకపోతే..ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడులు, అత్యాచారాలపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. మాజీ ప్రదాని మనవడిపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణ పూర్తిచేసిన సిట్.. ఆగస్టులో 2,144 పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించింది. ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి, హోళినరిసిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై కూడా లైంగిక వేధింపులు, కిడ్నాప్ వంటి ఆరోపణల్లో అరెస్టయ్యారు. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయట ఉన్నారు. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి హెచ్‌డి రేవణ్ణ అరెస్టయ్యినప్పటికీ బెయిల్ మంజూరైంది. ఫిర్యాదులో అతని తల్లి భవానీ రేవణ్ణను కూడా నిందితురాలిగా పేర్కొన్నారు. ఆమెకు ముందస్తు బెయిల్ వచ్చింది.