ఇక పై అమెరికాన్లకు సువర్ణయుగమే: ట్రంప్‌

Donald trump speech

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో ట్రంప్‌ ఆయన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూన్నారు. అమెరికా ఇలాంటి వియం ఎన్నడూ చూడలేదని ట్రంప్‌ అన్నారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతుంది. ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు పోరాడారు. రిపబ్లికన్‌ పార్టీకి 315 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఇది అమెరికన్లు గర్వించే విజయమని చెప్పారు. తమ దేశం కోలుకునేందుకు తన విజయం దోహదపడుతుందని చెప్పారు.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్‌ భారీ విజయం దిశగా సాగుతున్నారు. ఇప్పటికే ఆయన 300కుపైగా ఎలక్టోర్స్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఫైనల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్న ఆధిక్యం చూస్తే ట్రంప్‌ గట్టిగానే కొట్టినట్టు కనిపిస్తోంది.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి 277 ఎలక్టోర్స్‌లో విజయం సాధించారు. గట్టి పోటీ ఇస్తారు అనుకున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కేవలం 226 ఎలక్టోర్స్ వద్ద ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా ఫలితం రావాల్సిన 35 ఎలక్టోర్స్‌లో కూడా ట్రంప్‌ హవా కొనసాగుతోంది. అక్కడ కూడా ఫైనల్ రిజల్ట్స్ వస్తే మాత్రం ట్రంప్‌ మెజార్టీ 312 గా ఉండబోతోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి పార్లమెంట్‌లో భారీ మెజారిటీ వచ్చింది. సెనేట్‌లో మెజార్టీ రిపబ్లికన్ అభ్యర్థులు విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన 51 మంది, డెమోక్రటిక్ పార్టీకి చెందిన 42 మంది అభ్యర్థులు విజయం సాధించారు.

ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 270 ఎలక్టోరల్ ఓట్ల మెజారిటీ మార్కును అధిగమించారు. యునైటెడ్ స్టేట్స్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతానికి ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించి, 226 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్న డెమొక్రాట్ కమలా హారిస్‌ను ఓడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

?ே?. 大稻埕?. Wohnungseinbruchdiebstahl : justizministerium will Überwachungsbefugnisse verlängern ⁄ dirk bachhausen.