హోరా హోరీగా అమెరికా ఎన్నికల ఫలితాలు..ట్రంప్‌ 247..హారిస్‌ 214

US Election Result 2024: Donald Trump Inches Towards Victory Is Republicans Win Senate Majority

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం హోరా హోరీగా మారుతున్నాయి. కౌంటింగ్ జరిగే కొద్దీ ట్రెండ్స్ మారిపోతున్నాయి. మొదటి నుంచి ఆధిక్యతలో ఉన్న ట్రంప్ కు హరీస్ చేరువ అవుతున్నారు. మేజిక్ ఫిగర్ 270 కి దగ్గరగా 246 వద్ద ట్రంప్ ఉండగా… కమలా హరీస్ 210 కి చేరుకున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్ మేజిక్ కొనసాగింది. ట్రంప్ మద్దతు దారులు తమ గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అదే విధంగా డెమోక్రాట్లు కౌంటింగ్ పైనే ఫోకస్ పెట్టారు. మరి కాసేపట్లో ట్రంప్, కమలా హ్యారీస్ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు దోబుచులాడుతోంది. ట్రంప్ గెలుపు దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఒక్క సారిగా కమలా హారీస్ కు బలం పెరిగింది. 270 కి చేరువగా ట్రంప్ అడుగులు వేస్తున్న సమయంలో కమలా హ్యారీస్ దూసుకొచ్చారు. అధ్యక్ష పదవి దక్కాలంటే ట్రంప్ కు మరో 24 ఓట్లు రావాలి. అదే సమయంలో కమలా హ్యారీస్ కు 60 వరకు అవసరం. ఇక, అధ్యక్షుడిని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్స్ లో ఏడు రాష్ట్రాల్లో ఆరు చోట్ల ట్రంప్ ఆధిపత్యం కొనసాగింది. ఇదే ఇప్పుడు ట్రంప్ కు కలిసొచ్చే అంశంగా మారింది. పలు రాష్ట్రాల్లో సర్వే సంస్థల అంచనాలు సైతం తారు మారు అయ్యాయి. దీంతో, ట్రంప్ కు 24 సీట్లు దక్కితే గెలుపు ఖాయమైనట్లే.

ఇకపోతే.. కీలక రాష్ట్రాల్లోనూ ఇద్దరి మధ్య హోరా హోరీగా ఫలితాలు వస్తున్నాయి. నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపొందగా, న్యూ మెక్సికోలో కమల హారీస్ విజయం సాధించారు. కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, ఇల్లినాయిస్, మసాచుసెట్స్, మేరీల్యాండ్, న్యూజెర్సీ, న్యూయార్క్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్‌ల కమలా హ్యారీస్ గెలుపొందారు. అదే విధంగా..రిపబ్లికన్ల కంచుకోలుగా ఉన్న రాష్ట్రాలైన అలబామా, అర్కాన్సాస్, ఫ్లోరిడా, ఇండియానా, కెంటకీ, లూసియానా, మిస్సోరీ, మిస్సిస్సిప్పి, మోంటానా, నార్త్ డకోటా, నెబ్రాస్కా, ఒహియో, ఓక్లహోమా, సౌత్ కరోలినా, సౌత్ డకోటా, టేనస్సీ, టెక్సాస్, ఉటా వెస్ట్ వర్జీనియా, వ్యోమింగ్‌లో ట్రంప్ గెలుపొందారు.

కమలా హరీస్ అతి పెద్ద రాష్ట్రం కాలిఫోర్నియాలో విజయం సాధించారు. ట్రంప్ ఇప్పటికే 246 సాధించటం.. మరో 24 మాత్రమే అవసరం ఉండటంతో కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ పైన ఇప్పుడు ట్రంప్ మద్దతు దారులు ఉత్కంఠగా చూస్తున్నారు. అటు హ్యారీస్ మద్దతు దారుల్లోనూ ఆశలు పెరుగుతున్నాయి. ఇంకా ఆట ముగియలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సాయంత్రానికి ఎవరికి గెలుపు దక్కుతుందనేది ఒక స్పష్టత రానుంది. అమెరికా ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కౌంటింగ్ లో ఆధిక్యతలు మారుతుండటంతో ఇప్పుడు తుది ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??. ?推薦分享. Gefälschte flughafen seiten auf facebook verkaufen kein verlorenes gepäck.