ఏపీలో వైసీపీ సోషల్ మీడియా వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు , నేరాలకు పాల్పడుతుండడం తో పోలీసులు రంగంలోకి దిగి పిర్యాదులు అందినవారిపై చర్యలు తీసుకుంటున్నారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అయిన వర్రా రవీందర్ రెడ్డి, కల్లి నాగిరెడ్డి, కళ్లం హరికృష్ణారెడ్డి, బోడే వెంకటేశ్, మేకా వెంకట్రామిరెడ్డి వంటి వారిని పోలీసుల అరెస్ట్ చేసారు. ఇదే సమయంలో ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్‌పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసారు.